బ్రేకింగ్ నుంచి ఎక్స్‌క్లూజివ్ న్యూస్ వరకు అందిస్తూ క్రీడా అభిమానులను ఎల్లప్పుడు అప్ డేట్ చేసే క్రీడా జర్నలిస్ట్‌ల సేవలు మరువలేనివి. ప్రతి క్రీడాకారుడు గురించి వార్తలు అందిస్తూ ప్రతి క్రీడా అభిమానిని అప్డేట్ చేయడంలో ఈ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తుంటాయి. క్రీడారంగంలో ప్రతీ ఆట గురించి అద్భుతమైన విశ్లేషణలు ప్రచురిస్తూ క్రీడా అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారు. ఈ పాత్రికేయుల కారణంగానే చాలా ఆటల గురించి సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. వారు తమ రిపోర్టింగ్ తో అద్భుతమైన ఆటలు ప్రపంచానికి పరిచయం చేశారు.

క్రీడల పట్ల ఈ జర్నలిస్టులకు అమితమైన అభిరుచి ఉంటుంది. అందుకే ప్రతి మ్యాచ్ ని తమదైన శైలిలో బ్రహ్మాండంగా అభివర్ణిస్తుంటారు. వారి కోణం లో మ్యాచులను చూసి ఎలా ఎంజాయ్ చేయాలో సాధారణ అభిమానులు తెలుసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. క్రీడాకారులను, క్రీడా అభిమానులను కనెక్ట్ చేయడం వీరి పాత్ర ఎంతగానో ఉంటుంది. అలాగే క్రీడల్లో జరుగుతున్న అవకతవకలను వారి బయట పెడుతూ ఉంటారు. మోసాలను నిర్భయంగా బయట పెట్టి నిజాలు ఏంటో తెలియజేస్తారు.



అయితే ప్రతి ఏడాది జులై రెండవ తేదీన ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున క్రీడా జర్నలిస్ట్‌ల సేవలను గుర్తు చేసుకుంటారు. ఇదే రోజున 1924లో పారిస్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించారు. ఐతే ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవాన్ని 1994 లో ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ఈరోజు క్రీడలను ఒక లెవెల్ కి తీసుకెళ్ళిన స్పోర్ట్స్ జర్నలిస్టుల కృషిని గుర్తు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున స్పోర్ట్స్ జర్నలిస్టులను తమ ఫీల్డులో ఇంకా మెరుగ్గా పని చేయమని ప్రోత్సహిస్తుంటారు. ఇండియా హెరాల్డ్ వెబ్సైట్ కూడా క్రీడా జర్నలిస్ట్‌ల సేవలకు ధన్యవాదాలు తెలుపుతోంది. ముమ్ముందు రోజుల్లో స్పోర్ట్స్ జర్నలిస్టులు క్రీడలను ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని ఆశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: