పృథ్వీ షా.. ఈ ఆటగాడు భారత క్రికెట్ లో ఒక సంచలనమే అనే చెప్పాలి.  భారత జట్టులో స్థానం సంపాదించుకున్న సమయంలో ఊహించని విధంగా అద్భుతంగా రాణించాడు. ఇతని ఆటకి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఇండియన్ క్రికెట్ కి మరో సచిన్ టెండూల్కర్ దొరికాడు అని ఆనంద పడిపోయారు. కానీ ఎక్కువ రోజులు అదే ఫామ్ కొనసాగించలేకపోయాడు పృథ్వీ షా.  ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు. అయితే టీమిండియా ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో పృథ్వి షా భారత అంతర్జాతీయ జట్టులో స్థానం దొరకడం కష్టంగా మారిపోయింది.



 అలాంటి సమయంలోనే ఐపీఎల్ ప్రారంభమైంది.  అయితే ఐపీఎల్ లో కూడా రెండు మూడు మ్యాచ్లు ఉసూరుమనిపించాడు.  కానీ ఆ తర్వాత మాత్రం ఊహించని విధంగా పుంజుకున్నాడు.  జట్టులో కీలక ఆటగాడిగా ఓపెనర్ గా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. అంతకుముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో కూడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇక మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా కి  మంచి డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంక టూర్ కోసం టీమ్ ఇండియా ఎంపికయ్యాడు. ఇది ఇలా ఉంటే ఇక ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నుంచి పృథ్వీషా కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.



 ఇటీవలే జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని స్థానంలో పృథ్వీ షా ని  ఆడించాలని బిసిసిఐ సెలెక్టర్లు భావిస్తున్నారట. అయితే ఇప్పటికే జట్టులో మయాంక్ అగర్వాల్, కె.ఎల్.రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం పృథ్వీ షా   కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక టూర్ కు వెళ్లిన జట్టులో ఉన్నాడు ప్రస్తుతం ప్రతి విషయం.  ఇక ఈ పర్యటన జూలై 25 ముగియనుండడంతో అటు వెంటనే పృథ్వీ షా ఇంగ్లాండ్ బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: