నేడు ప్రపంచ దేశాలన్నీ ఎంతో సంతోషంగా పాల్గొంటున్న ఒలింపిక్ క్రీడలు ప్రాచీన గ్రీకు పండుగగా క్రీస్తు పూర్వం 776 జరిపే వారు. మొదటి సారిగా 3000 సంవత్సరాల క్రితం ఈ ఒలింపిక్ గేమ్స్ జరిగాయి. అయితే నేటి పిల్లలకు తెలియని ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ క్రీడలను జరపడానికి ప్రధాన కారణం గ్రీకుల యొక్క జ్యుస్ దేవుణ్ణి గౌరవంగా పూజించడం కోసమే. అయితే చాలా మందికి ఒక సందేహం కలగక మానదు. అసలీ ఈ గేమ్స్ కు ఒలింపిక్ అనే పేరు ఎలా వచ్చింది అని, తెలుస్తున్న సమాచారం ప్రకారం గ్రీస్ లో ఉన్న ఒక ఎత్తైన పర్వతం ఒలింపస్ ఉండేది. ఆ పర్వతంపైన దేవతలు జీవించారని వారు గట్టిగ నమ్మరు. ఆ కారణంగానే వారి దేవతలకు గుర్తుగా ఈ క్రీడలకు ఒలింపిక్ గేమ్స్ అనే పేరు పెట్టడం జరిగింది.
* ఈ రోజు మనము జరుపుకుంటున్న ఒలింపిక్ గేమ్స్ లో మొదట అన్ని గేమ్స్ జరపబడలేదు. పురుషులకు 200 మీటర్ల రేస్ లను మాత్రమే ప్రారంభించారు. ఈ రేస్ 20 మంది పరుగు తీసేందుకు వీలుగా ట్రాక్స్ చేయబడ్డాయి.

 * అప్పట్లో గ్రీకులు ఈ క్రీడలను నగ్నంగా జరుపుకునే వారు. కానీ కాలక్రమేణా చాలా మార్పులు వచ్చిన సంగతి మనము చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు దుస్తులను ధరించి ఈ ఆటలను జరుపుకుంటున్నాము. అప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే పాల్గొనే గేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ గేమ్స్ గెలవడానికి టీమ్స్ గా ఏర్పడే అవసరం లేదు. ఉదాహరణకు. గుర్రాల పరుగు పందెము, రథాల పందెము, బాక్సింగ్ మరియు కుస్తీ పోటీలు ఉండేవి.
 
* ప్రాచీన కాలంలో ఈ ఆటలకు ఎటువంటి అవార్డులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి ఆటకు మూడు పథకాలను బంగారు, వెండి మరియు కాంస్య రూపంలో అందిస్తున్నారు.

* కానీ ఇప్పటికే లాగే అప్పుడు కూడా ఆటలు ఆడే సమయంలో న్యాయనిర్ణేతలు ఉండేవారు. వారి నిర్ణయం మేరకే పోటీలో విజేతను నిర్ణయిస్తూ ఉండేవారు. అప్పట్లో గెలిచిన వారికి ఆలివ్ దండను ఇచ్చే వారు. అక్కడున్న ఒలింపియా లోని జ్యూస్ దేవాలయం దగ్గర ఉన్న చెట్టు నుండి సేకరించిన ఆకులతో ఆ దండను చేస్తారు. ఇది వారికి చాలా విలువైనది గా భావిస్తారు.
* ఈ గేమ్స్ లో మహిళలు పాల్గొనడానికి వీలు లేదు. అంతే కాకుండా వివాహం అయినా స్త్రీలను కనీసం ఈ ఆటలను చూడడానికి కూడా అనుమతించేవారు కాదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వచ్చి పట్టుబడితే, అటువంటి వారిని ఒలింపస్ పర్వతం నుండి కిందికి తోసివేయబడే వారు. ఇది ఎంత పాపమో కదా. కానీ నేడు పూర్తిగా విరుద్ధం ప్రతి ఒక్కరూ ఈ ఆటలలో పాల్గొనవచ్చు మరియు చూడవచ్చు.

 * కానీ మహిళలకు ఒక రకమైన పండుగను జరిపే వారు. దీనిని జ్యూస్ భార్య హీరా గౌరవానికి ప్రతీకగా జరిగేది. దీనికి హెరెన్ గేమ్స్ అని నామకరణం చేశారు.
 
* పోను పోను ఈ ఆటలకు ప్రాధాన్యత పెరిగింది. అప్పట్లో కేవలం 5 రోజులు మాత్రమే ఈ ఆటలు జరుపబడేవి.  దాదాపు 40,000 మంది వరకు ఈ ఆటలను తిలకించడానికి వచ్చే వారు. ఈ ఆటలు గ్రీకు నగరం మరియు ఇతర రాష్ట్రాల మధ్యన శాంతి ఏర్పడానికి బాగా ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు.  

* ఈ ఆటలు వారి మధ్య జరిగే యుద్ధాలను నిలపడానికి ఉపయోగపడ్డాయి. కానీ ప్రజలకు ఎటువంటి భయం లేకుండా, ఒకవేళ ఎవరైనా దాడి చేసినా వారిని కాపాడుకోవడానికి, ఆతల ద్వారా శిక్షణ పొందేవారు. ఇవి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేవి.

* అయితే ఇలా జరుగుతూ ఉండగా, క్రీ.శ 393 లో అప్పటి చక్రవర్తిగా ఉన్న థియోడోసియస్ ఈ ఒలింపిక్ ఆటలను పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇలా చేయడానికి కారణం, క్రిస్టియన్ మతానికి అడ్డుగా ఉన్న ఇతర పండుగలన్నిటినీ రద్దు చేయడానికి చక్రవర్తి ఇలా చేసారని తెలుస్తోంది.

* అప్పటి నుండి మళ్ళీ ఒలింపిక్ క్రీడలను జరుపుకోవడానికి 1500 సంవత్సరాలు పట్టింది. ఆ బారన్ పియరీ డి కూబెర్టిన్ మళ్ళీ ఒలింపిక్ గేమ్స్ తిరిగి మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టాడు. ఇతని కాలంలోనే ఒలింపిక్ గేమ్స్ జరిగే నగరంలో టార్చ్ వెలిగించే వారు.

* ఒలింపిక్ గేమ్స్ కు పునాది అయిన జ్యూస్ ఆలయం ప్రపంచంలో ఉన్న పురాతనమైన అద్భుతాలలో ఒకటిగా పేరొందింది. ఈ దేవతా విగ్రహాన్ని 41 అడుగులు ఉండేలా నిర్మించారు. దీనిని ఫిడియాస్ నిర్మించడం జరిగింది. కానీ ఈ విగ్రహం క్రీ శ 5 వ శతాబ్దంలో ద్వాంసం అయినట్లు సమాచారం. ఒలింపిక్ జరుగుతున్న మూడవరోజున జ్యూస్ దేవతకు గౌరవంగా 100 ఎద్దులను ఆ దేవతకు తగలబెట్టడం జరిగేది.
* ఇలా ఇప్పుడు ఎంతో అట్టహాసంగా జరుపుకుంటున్న ఒలింపిక్ గేమ్స్ కు ఇంత చరిత్ర ఉంది . ఎన్నో తెలియని విషయాలున్నాయి. కాగా ఈ సంవత్సరం జపాన్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. టోక్యో నగరంలో ఎంతో వైభవంగా జులై 23 వ తేదీన జరగనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: