టోక్యోలో ఒలింపిక్స్‌ 2021 క్రీడాలు ఈ నెలలో ప్రారంభం కానున్న సంగతి విధితమే. అయితే... ఈ ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వాహకులు అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ విలేజ్‌ లో సెక్స్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు క్రీడా కారుల రూముల్లో కార్డు బోర్డుతో చేయించ బడిన అతి తక్కువ సామర్థం కలిగిన... బెడ్లను తయారు చేసించారు నిర్వాహకులు. అయితే... ఈ బెడ్లకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో క్రీడా కారులలో ఒకరి నుంచి... మరొకరికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు..సరికొత్త తరహాలో మంచాలను తయారు చేసారు ఒలింపిక్స్‌ నిర్వాహకులు.  

అయితే... ఈ బెడ్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో ఒలింపిక్స్‌ అథ్లెట్లు సెక్స్‌ అసలు పాల్గొన కుండా ఉండేందుకే.... ఈ మంచాలను తయారు చేయించారని సోషల్‌ మీడియా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే... ఈ మంచాలు అట్ట ముక్కలతో తయారు చేసినవి. ఆ మంచాలపై పడుకునే... కాస్త అటు.. ఇటు గట్టిగా ఊగితే చాలు.. అమాంతం కుప్పకూలుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఒలింపిక్స్‌   అథ్లెట్లు శృంగారం లో పాల్గొన కుండా ఉండేందుకే ఈ కొత్త తరహా మంచాలను తయారు చేయించారని వైరల్‌ చేస్తున్నారు. అయితే.... ఈ సోషల్‌ మీడియా ప్రచారంపై ఒలింపిక్స్‌ నిర్వాహకులు కూడా స్పందించారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలను కొట్టిపారేశారు ఒలింపిక్స్‌ నిర్వాహకులు. ఆటగాళ్ల కోసం... తయారు చేయించిన మంచాలు చూడటానికి అలాగే కనిపిస్తాయని పేర్కొన్న ఒలింపిక్స్‌ నిర్వాహకులు.... ఆ మంచాలు చాలా దృడమైనవి అంటున్నారు. ఏకంగా 200 కిలోల బరువులను కూడా అవలీలగా మోస్తాయని చెప్పారు ఒలింపిక్స్‌ నిర్వాహకులు. శృంగారాన్ని కట్టడి చేసేందుకు తాము...అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంత ఉత్తి మాటేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: