ప్రస్తుతం యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎన్నో అవాంతరాలు తర్వాత ప్రస్తుతం శ్రీలంక వన్డే సిరీస్ జరుగుతుంది. అయితే మొదటి వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు సొంత గడ్డపై లంక జట్టును మట్టి కరిపించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక మొదటి వన్డే మ్యాచ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఎంతోమంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక రెండవ ఇన్నింగ్స్ కూడా గెలుచుకుని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది అని అందరూ అనుకున్నారు.



 అయితే ఇక నిన్న జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా మొదట పేలవ ప్రదర్శనతో అభిమానులందరినీ టెన్షన్ పెట్టింది. ఒకానొక దశలో ఇక టీమిండియా పని అయిపోయింది అని అనుకున్నారు అందరు. రెండో వన్డే మ్యాచ్ భారత్ చేర్చుకున్నట్లు కనిపించిన సమయంలో దీపక్ చాహర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆశ్చర్యపరిచాడు. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 191 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఓటమి లాంఛనమే అనుకున్నారు అందరు. కానీ 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దీపక్ సార్ 82 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి అసాధారణ పోరాటపటిమను కనబరిచాడు  అతనికి బౌలర్ భువనేశ్వర్ నుంచి కూడా సహకారం ఉంది. దీంతో ఇక టీమిండియా విజయం సాధించింది.



 అయితే నిన్న జరిగిన వన్డే మ్యాచ్ విజయంతో టీమిండియా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఇక ఇటీవలే రెండో వన్డే మ్యాచ్ విజయంతో శ్రీలంక జట్టు పై 93 విజయాలు సాధించింది టీమ్ ఇండియా జట్టు. దీంతో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఐదవ వికెట్ కోల్పోయిన తర్వాత 160 పరుగుల చేదన  చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా టాప్3 బ్యాట్స్మెన్లు ఒక హాఫ్ సెంచరీ కూడా చేయకుండా టీమిండియా 150కి పైగా పరుగులు సాధించడం 2015 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: