ఆటల పండుకకు అంతా రెడీ అయ్యింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రారంభోత్సవ వేడుకకు భారత్ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులు హాజరవుతున్నారు. సాధారణంగా జరిగే ఒలింపిక్ పేరేడ్‌ను ఒలింపిక్స్ కమిటీ రద్దు చేసింది. కొవిడ్ కారణంగా కేవలం 20 మంది విశిష్ఠ అతిధులు మాత్రమే ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు.

ఒలింపిక్స్ తొలిరోజు నుంచే పతకాల కోసం భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, ఆమె భర్త అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌ పోటీ పడుతున్నారు. పారిస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో వీరంతా సత్తా చాటడంతో... పతకాలు సాధిస్తారని అభిమానులు గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచకప్‌లోని మూడు విభాగాల్లో దీపిక స్వర్ణ పతకాలు సాధించింది. వ్యక్తిగత, మిక్స్‌డ్‌, గ్రూప్‌ పోటీల్లో వరుస పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్‌లో కూడా సత్తా చాటుతుందని యావత్‌ భారతదేశం ఎదురుచూస్తోంది.

2012 తర్వాత ఆర్చరీ విభాగంలో భారత పురుషుల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది ఇప్పుడే. వెటరన్ ఆర్మీ ఆర్చర్‌్ తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, అతాను దాస్‌తో మెన్స్‌ టీమ్‌ బలంగా ఉంది. 2019 ప్రపంచకప్‌లో రజతం గెలిచిన టోక్యో బెర్త్‌ను ఖరారు చేసుకుంది మెన్స్‌ టీమ్. రాయ్‌కు ఇది మూడో ఒలింపిక్స్‌ కాగా... అతానుకు రెండోది. రాయ్ ఏథెన్స్‌లో ఆడగా.... అతాను రియోలో సత్తా చాటాడు. 2019 నుంచి కొరియా, చైనీస్‌ తైపీ, చైనా, జపాన్‌ ఆర్చర్లు... అంతర్జాతీయ వేదికల్లో పోటీ పడకపోవడంతో... పతకాలు ఎవరు గెలుుస్తార అంచనా వేయలేని పరిస్థితి.అటు బ్యాడ్మింటన్ విభాగంలో కూడా పతకం తప్పకుండా వస్తుందని భారత అభిమానుల గట్టి నమ్మకం. జయహో భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: