జపాన్ లోని టోక్యో నగరంలో నిన్న 23 జులై నుండి ఎంతో అట్టహాసంగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా నుండి అనేక విభాగాల్లో ఎంతోమంది క్రీడాకారులు పథకాల లక్ష్యమే విధిగా బరిలోకి దిగుతున్నారు. భారత ప్రభుత్వం కూడా పథకాలు సాధించిన వారికి భారీగానే నజరానాలు ఇవ్వనుంది. మరి ఇండియా ఎన్ని పథకాలు సాధిస్తారో ? గత ఒలింపిక్ గేమ్స్ లో కన్నా మెరుగ్గా రాణిస్తుందా ? అన్న పలు ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం ఇండియా నుండి 10 మీటర్ ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వీ చండేలా ఫైనల్ కు అర్హత సాధించలేకపోవడం భారతీయులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈమెతో పాటుగా ఎలవెనిల్ కూడా ఉన్నారు. మొత్తం భారత్ నుండి ఈ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో వీరిద్దరితో పాటుగా పురుషుల విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మలు కూడా పాల్గొనబోతున్నారు.
10 మీటర్ ఎయిర్ రైఫిల్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన యాంగ్ కియాన్ గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఒలింపిక్ గేమ్స్ లో మొదటి గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది. ఈమె అత్యుత్తమ ఒలింపిక్ రికార్డ్ స్కోర్ ను సాధించడం విశేషం. ఈమె స్కోర్ చూస్తే 251.8 గా ఉంది. దీనితో చైనా దేశంలో ఈ విజయాన్ని జరుపుకుంటున్నారు. ఈమె తరువాత స్కోర్ తో గలాషినా సిల్వర్ మెడల్ ను పొందగలిగింది. చివరగా నినా క్రిస్టెన్ బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది. కేవలం 0.3 పాయింట్ల తేడాతో డ్యూస్టాడ్ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. మిగిలిన స్థానాల్లో మిగతావారున్నారు. వీరిలో ఇండియాకు సంబంధించి ఎలావెనిల్ 16 వ స్థానంలో ఉండగా, అపూర్వీ చండేలా 36 వ స్థానంతో సరిపెట్టుకుంది. తరువాత రౌండ్స్ లో అయినా ఆశాజనకమైన ప్రతిభను కనబరుస్తారా చూడాలి. 

ఇక ఈ విభాగంలో ఇండియా పథకాన్ని కోల్పోయినట్లే. ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరు భారతీయులను తీవ్రంగా నిరాశపరిచారు. ఇక పురుషులయినా షూటింగ్ లో పథకాన్ని సాధించగలరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఇవి కాకుండా ఆర్చరీ లో దీపికా కుమారి తొమ్మిదవ స్థానంలో నిలిచి పథకాలపై ఆశలు చిగురించేలా చేసింది. ఈమె కాకుండా ప్రవీణ్ జాదవ్ పై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది. మరి ఈ రోజైనా పథకంతో ఇండియా పథకాల పట్టిక కదులుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ రోజు పోటీలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను కూడా పథకాన్ని సాధించగలదన్న నమ్మకం ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: