ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ప్రారంభించింది. అయితే ఈ టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా భారత క్రీడాకారులు అందరూ కూడా పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే కొంత మంది క్రీడాకారులు నిరాశ పరుస్తున్నారు. దీంతో భారత ప్రజలు మొత్తం నిరాశ లో మునిగి పోయిన సమయంలో పథకం సాధించి ఉత్సాహాన్ని నింపింది ఓ మహిళా. మహిళల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో 49 కిలోల  విభాగంలో మీరాబాయి చాను ఏకంగా రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. దీంతో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన మొట్టమొదటి మహిళగా మీరాబాయి చాను భారత చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది .



 ఇక భారత పథకాల పరంపర మీరబాయ్ చాను పథకం తోనే ప్రారంభం అయ్యింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రస్తుతం మీరాబాయి చాను పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరు మీరాబాయి చాను ప్రతిభ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత ప్రజలందరి గర్వంగా భావించే విధంగా మీరు ప్రతిభ చాటారు అంటూ మీరాబాయి చాను పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ఎవరూ కూడా ఒలంపిక్స్ లో ఇప్పటివరకు పథకాన్ని సాధించలేదు.



 ఈ క్రమంలోనే ఇక ఎన్నో ఏళ్ల తర్వాత ఇటీవలే మీరాబాయి చాను ఏకంగా రజత పతకాన్ని సాధించి రికార్డు సృష్టించారు. ఒకానొక దశలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధిస్తుంది ఏమో అనుకున్న విధంగానే ప్రతిభ చాటారు. కానీ అడుగు దూరంలో ఓడిపోయి చివరికి రజత పతకాన్ని సాధించారు. అయితే ఇక ఇటీవల టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకం తో సత్తా చాటిన మీరబాయ్ చాను కి మణిపూర్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మీరబాయ్ చాను కి కోటి రూపాయల బహుమతి తో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా రిజర్వు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది  ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ప్రకటించారు. ఇక మరో వైపు ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డామినోస్ కూడా ఏకంగా మీరాబాయి చాను కు ఇక ఆమె జీవితాంతం పిజ్జాలు ఉచితంగా ఇస్తాము అంటూ ప్రకటించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: