కొలంబో వేదికగా నిన్నటి రోజున శ్రీలంక మరియు టీమ్ ఇండియా ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో... మంచి ఆటతీరును కనబరిచి... బోణీ కొట్టింది ఇండియా. శ్రీలంక జట్టుపై టీమిండియా అవలీలగా గెలిచింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. మొదట టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  దీంతో టీమిండియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇకముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా... చాలా అద్భుతంగా ఆడింది. 

ఓపెనర్ పృద్వి షా డకౌట్ అయినప్పటికీ.... కెప్టెన్ శిఖర్ ధావన్ మరియు సూర్య కుమార్ యాదవ్ మంచి ఆటతీరును కనబరిచారు. శిఖర్ ధావన్ 46 పరుగులు మరియు సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు, సంజు శాంసన్ 27 పరుగులు, కిసాన్ కిషన్ 20 పరుగులు చేసి  టీమిండియాను... 20 ఓవర్లలో164 పరుగులకు చేర్చారు. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు మొదటి నుంచి... ఎలాంటి పోటీని ఇవ్వలేకపోయింది.  శ్రీలంక బ్యాట్స్ మెన్ లలో.... అసలంక 44 పరుగులు చేసి.. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

కానీ శ్రీలంక జట్టులోని ఇతర ఆటగాళ్లు... ఎలాంటి  ఆటతీరును కనబరచక పోవడంతో.. శ్రీలంక జట్టు చతికిలపడింది. దీంతో శ్రీలంక జట్టు 18 ఓవర్లలోనే 126 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీమ్ ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే... టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి... శ్రీలంక బ్యాట్స్ మెన్ల నడ్డి విరిచాడు. అంటూ దీపక్ చాహర్ రెండు వికెట్లు, క్రునాల్, వరుణ్ చక్రవర్తి చాహాల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. దీంతో శ్రీలంక పై  టీం ఇండియా విజయం అనివార్యం అయింది. ఇక మూడు వన్డే ల సిరీస్ లో.. ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: