ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వన్డే టి20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు.  అయితే ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తి చేసుకుని భారత జట్టు వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించింది.  ఇప్పుడు టి20 సిరీస్ లో కూడా ఎంతో దూకుడుగా రాణిస్తుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే మొదటి టి20 సిరీస్ అద్భుతంగా ఆడి విజయాన్ని సాధించింది. అయితే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు శిఖర్ ధావన్ కూడా కెప్టెన్గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు కీలక బ్యాట్స్మెన్గా కూడా పరుగుల వరద పారించాడు.



 అయితే నిన్న క్రికెట్ టీమ్ ఇండియా శ్రీలంక మధ్య రెండో టి20 మ్యాచ్ జరగాల్సిఉంది. ఈ క్రమంలోనే ఇక రెండో టీ20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే టీమిండియా జట్టులో ఉన్న కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారిన పడడంతో ఇక నిన్న రెండో టి20 మ్యాచ్ కాస్త వాయిదా పడే పరిస్థితి వచ్చింది  ఇక ఆ తర్వాత కృనాల్ పాండ్యా తో గత కొన్ని రోజుల నుంచి సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్ళకు కూడా ఇటీవలే పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ అని వచ్చింది.  ఈ క్రమంలోనే టీమిండియా పలు మార్పులతో నేడు ఇక రెండవ టీ 20 మ్యాచ్ ఆడేందుకు సిద్దం అయింది. ఈ క్రమంలోనే ఇటీవల కీలక విషయాన్ని వెల్లడించింది  బీసీసీఐ  .



 ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యా తో  జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు ఇటీవల గుర్తించారు..  సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్,  సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, మనీష్ పాండే, కృష్ణప్ప గౌతమ్, ఇషన్ కిషన్ లాంటి ఆటగాళ్లు సన్నిహితంగా ఉన్నట్లు తేలింది  ఈ క్రమంలోనే వారిని కఠినమైన ఐసోలేషన్  లో ఉంచారు.. ఈ క్రమంలోనే ఈ ఎనిమిది మంది ఆటగాళ్లు మిగతా టి20 లకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ ధోనీ శిఖర్ ధావన్ కూడా ఐసోలేషన్ లో ఉండటంతో ఇక ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ రెండో టి20 మ్యాచ్ నుంచి ఇక టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇది కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: