భారతదేశంలో క్రీడలకు ప్రత్యేక అభిమానులున్నారు. స్థానికంగా పోటీలు జరిగితేనే అభిమానులు ఆ క్రీడలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ స్థాయిలో పోటెత్తి వస్తారు. అందులో వారి ఫేవరెట్ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి గెలవాలని వారిని సపోర్ట్ చేస్తుంటారు. అటువంటిది ప్రపంచ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతున్నాయంటే, ప్రతి ఒక్క భారతీయుడి మనసులో మన ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ గెలవాలని కోరుకుంటారు. కొద్ది రోజుల నుండి ఒలింపిక్ గేమ్స్ 2020 జపాన్ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నో భద్రతా ప్రమాణాలను పాటించి జరుపుతున్నారు. వాస్తవానికి ఈ ఒలింపిక్ గేమ్స్ గత సంవత్సరమే జరగాల్సి ఉన్నా కరోనా వైరస్ దాడితో ఈ సంవత్సరానికి అవి వాయిదా పడ్డాయి.
ఎన్నో ఆశలతో ఇండియా నుండి క్రీడాకారులు అనేక విభాగాల్లో పోటీ పడుతున్నారు. దాదాపు అనేక విభాగాల్లో నిరాశ పరిచే ఆట తీరుతో ఇండియా అభిమానులను బాధపడేలా చేశారని చెప్పాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగమ్మాయి పి వి సింధు మాత్రం పతకం సాధించే దిశగా దూసుకుపోతోంది. బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో పోటీ పడుతున్న సింధు అప్రతిహత విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. బంగారు పతకానికి ఇంకో మూడు అడుగుల దూరంలో నిలిచి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. రియో వేదికగా 2016 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో పి వి సింధు ఫైనల్ కి చేరింది.

కానీ ఫైనల్ లో పీవీ సింధు తన ప్రత్యర్థి స్పెయిన్ కి చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలై గోల్డ్ మెడల్ ను తృటిలో చేజార్చుకుంది. అలా తను పాల్గొన్న మొదటి ఒలింపిక్ గేమ్స్ లోనే ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించింది. ఈ సారి ఎలాగైనా గోల్డ్ మెడల్ ను సాధించాలని కలతో జపాన్ చేరింది. ఈ సారైనా తన బంగారు పతక కల నెరవేరుతుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: