మావా అన్నా.. మచ్చ అన్న.. బావ అన్న.. బామ్మర్ది అన్న..  బాబాయ్ అన్న.. ఏరా ఒరేయ్ అంటూ పిలిచినా.. అన్నిటికి ఒకటే కేరాఫ్ అడ్రస్ ఫ్రెండ్షిప్.  ఎన్నో బంధాలు ఆ బంధాలకు విచిత్రమైన పేర్లు.. ఏ పేరుతో పిలిచినా.. పలికేది మాత్రం అటునుంచి ఫ్రెండ్ మాత్రమే.  ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల దే కీలక పాత్ర. చిన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు స్నేహితులే తోడునీడగా ఉంటారు.. కన్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు అయినా  తోడుగా ఉంటారో లేదో తెలియదు.. కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సంతోషం వచ్చినా మీకంటూ ప్రత్యేకంగా పక్కన ఒక స్నేహితుడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు. అందుకే ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని చెబుతూ ఉంటారు.


 అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతోమంది తమకంటూ లైఫ్ లో ఒక ప్రత్యేకమైన ఫ్రెండుని కలిగి ఉంటారు.  ఇక మన భారత క్రికెట్లో కూడా ఎంతో మంది ఆటగాళ్లు ఇప్పటివరకు తన ఆటతో ప్రేక్షకులను అలరించడమే కాదు తమ స్నేహం బంధంతో కూడా ఎంతోమంది ఆదర్శంగా నిలిచారు. మన భారత క్రికెట్ లో స్నేహంతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయిన క్రికెటర్లు  ఎవరో తెలుసుకుందాం.



1. సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ

ప్రపంచ క్రికెట్‌లో బాగా క్రేజ్ సంపాదించిన ఓపెనింగ్ జోడిలో  ఒకరైన సచిన్ టెండూల్కర్ మరియు సౌరవ్ గంగూలీ ఇద్దరూ మంచి ఆటగాళ్లు మాత్రమే కాదు నిజజీవితంలో మంచి స్నేహితులు. అప్పట్లో భారత క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ స్టార్ ఓపెనింగ్ జోడి.. ఇక స్నేహితులుగా కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు .

2. రాహుల్ ద్రవిడ్ - వివిఎస్ లక్ష్మణ్

ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో విన్నింగ్ భాగస్వామ్యంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు ఇద్దరు. ఇక్కడ లక్ష్మణ్ కెరీర్‌లో 281 పరుగుల ఇన్నింగ్స్ సాధించాడు. రాహుల్ ద్రావిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ ద్వయం యొక్క ఫ్రెండ్షిప్ కూడా  చాలా అద్భుతంగా ఉండేది.. ఈ ఇద్దరు  మైదానంలో సొంత విషయాలను కూడా చర్చించుకునే వారట .

3. MS ధోనీ - యువరాజ్ సింగ్

భారత జట్టులో అత్యంత సమర్థవంతమైన అద్భుతమైన  ఫినిషింగ్-పెయిర్‌లలో ఒకటైన ఎంఎస్ ధోనీ మరియు యువరాజ్ సింగ్  జోడి ఒకటి. ఇద్దరూ భారత జట్టు కోసం చాలా మ్యాచ్ లను విజయవంతంగా ముగించారు. ఇద్దరూ మైదానంలో అద్భుతమైన బంధాన్ని పంచుకున్నారు, ఇది వారి బ్యాటింగ్ ప్రదర్శనలలో కూడా ప్రతిబింబిస్తుంది. ఇక ఇద్దరిలో ఎవరు అద్భుతంగా రాణించిన మరొకరు సెలబ్రేట్ చేసుకునే వారు?

4. గౌతమ్ గంభీర్ - వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీకి చెందిన డాషింగ్ ద్వయం వీరేంద్ర సెహ్వాగ్ మరియు గౌతమ్ గంభీర్ ఎన్నో ఏళ్ల నుండి పాటు  అద్భుతమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు . ఇద్దరూ కలిసి ఢిల్లీ కోసం ఆడారు. బహుశా ఇదే వీరి మధ్య స్నేహ బంధం మరింత బలపడ డానికి కారణమయింది.. ఇక వీరిద్దరూ మైదానంలో దూకుడుగా ఆడుతూ మ్యాచ్ ను ముగించడాన్ని భారత ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

5. విరాట్ కోహ్లీ - శిఖర్ ధావన్

విరాట్ కోహ్లీ మరియు శిఖర్ ధావన్ గొప్ప స్నేహితులు అని చాలా మందికి తెలియదు. . ఇద్దరి మధ్య పంజాబీ అనుబంధం ఉంది, ఇద్దరు కూడా రంజీ రోజుల నుండి ఢిల్లీ కోసం కలిసి ఆడారు. అప్పటి నుంచే వీరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా బలంగా ఉంది .

6. కెఎల్ రాహుల్ - హార్దిక్ పాండ్యా

కెఎల్ రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. కాఫీ విత్ కరణ్ వివాదం తర్వాత కూడా వారు వారి స్నేహబంధాన్ని మునుపటిలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరు   చాలా సందర్భాలలో చాలా ఫోటోలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫ్రెండ్షిప్ ఎంత బలంగా ఉంది అన్న విషయాలను చెబుతూనే ఉన్నారు .

7. రోహిత్ శర్మ - యుజ్వేంద్ర చాహల్

రోహిత్ శర్మ మరియు యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ కూడా ఇటీవలే భారత క్రికెట్ స్నేహితుల జాబితాలో చేరారు. సోషల్ మీడియాలో వారి స్నేహం చాలా ఫన్నీగా ఉంటుంది.. ఇక వీరిద్దరూ కూడా తమ స్నేహబంధాన్ని తెలుపుతూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: