ప్రస్తుతం గత కొద్ది రోజుల నుండి జపాన్ దేశంలో టోక్యో వేదికగా ఒలింపిక్ గేమ్స్ 2020 జరగుతున్న విషయం తెలిసిననదే. ఈ గేమ్స్ లో భారత్ నుండి వివిధ విభాగాల్లో అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభంలో మంచి ఆరంభాలు దక్కినా, గేమ్స్ సాగుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా ఒలింపిక్ గేమ్స్ నుండి నిష్క్రమిస్తూ భారతీయులు పెట్టుకున్న నమ్మకాన్ని మరియు ఆశలను వమ్ము చేశారు. భారత్ ఖాతాలో కొన్ని పతకాలు అయినా వస్తాయని ఆశించిన కోట్లాదిమంది అభిమానుల్లో నిరాశే మిగిలింది. ఈ రోజు పొద్దున వరకు భారత్ ఖాతాలో ఒక్క పతకం మాత్రమే ఉంది.
ఇదిలా ఉంటే భారత్ నుండి ఖచ్చితంగా బ్యాడ్మింటన్ విభాగంలో గోల్డ్ సాధిస్తుందని పివి సిందుపై నమ్మకముంచారు. కానీ నిన్న తై జు యింగ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వరుస సెట్ల లో ఓడి బంగారు పతకం పొందడానికి దూరమైంది. కానీ కాంస్యం పొందడానికి అవకాశాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. అయితే అభిమానులంతా కనీసం కాంస్య పతకం అయినా గెలుస్తుందా అన్న అనుమానాలు పెట్టుకున్నారు. కానీ అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ ఈ రోజు మధ్యాహ్నం చైనాకు చెందిన హి బింగ్జియావో తో తలపడింది. ఈ మ్యాచ్ లో సింధు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో 21-13 21-16 స్కోర్ తో మ్యాచ్ ను చేజిక్కించుకుంది.
 కొన్ని సార్లు నెట్ దగ్గర కొంచెం ఇబ్బందిపడినా, ఆ పొరపాట్లు సింధు విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సింధు ఆటకు చైనా ప్లేయర్ ఖంగుతింది. కళ్ళు తెరిచి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విజయంతో సింధు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం భారతీయులందరికీ గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ భారత క్రీడాకారుడు పాల్గొన్న వరుస ఒలింపిక్ గేమ్స్ లో పతకాన్ని సాధించింది లేదు...

మరింత సమాచారం తెలుసుకోండి: