ఒలింపిక్ గేమ్స్ 2020 అసలు జరుగుతాయా జరగవా అని ఎన్నో సందేహాలు ఉండేవి. కానీ ఎట్టకేలకు పది రోజుల క్రితమే జపాన్ లో టోక్యో వేదికగా మొదలయ్యాయి. ఈ ఒలింపిక్ గేమ్స్ లో భారత్ నుండి అనేక విభాగాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంకో వారం రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ ముగియనుండగా ఇప్పటి వరకు భారత్ కేవలం 2 పతకాలతో పట్టికలో 61 వ స్థానంలో ఉంది. కాగా ఎప్పటి లాగే చైనా మొత్తం 53 పతకాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ బాక్సింగ్ మరియు బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో రజతం మరియు కాంస్య పతకాలను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపుగా మరో రెండు పతకాలు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్ మహిళలు మరియు పురుషుల హాకీ టీమ్ లు సెమీస్ కు దూసుకెళ్లారు. నిన్న పురుషుల హాకీ టీమ్ సెమీస్ కు చేరుకోగా, ఈ రోజు ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అభేద్యమైన మూడు సార్లు ఒలింపిక్ఆ ఛాంపియ అయిన ఆస్ట్రేలియా టీమ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఒలింపిక్ గేమ్స్ లో మహిళల హాకీ టీమ్ మూడు వరుస ఓటములతో దాదాపు టోర్నీ నుండి నిష్క్రమిస్తుందనుకుంటే, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వరుసగా పెద్ద టీమ్ లను సైతం మట్టి కరిపిస్తూ బంగారు పతకానికి ఇంకో రెండడుగుల దూరంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళల హాకీ జట్టు ఇప్పుడు సెమీఫైనల్ లో ఉంది. ఇది భారత ఒలింపిక్ గేమ్స్ చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. ఇప్పటి వరకు మహిళల ఒలింపిక్ గేమ్స్ రికార్డు 1980 సంవత్సరంలో నాలుగో స్థానానికి చేరడం మాత్రమే. కానీ ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పుడు భారతీయులంతా ఖచ్చితంగా పురుషులు మరియు మహిళలు ఇద్దరూ గోల్డ్ మెడల్ ను సాధిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మరి భారతీయుల నమ్మకాన్ని హాకీ టీమ్ నిలబెట్టుకుంటుందా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: