బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం  పీవీ సింధు, రెజ్లర్ సుశీల్ కుమార్ ఇద్దరి పేరు తెలియని వారు లేరు. ఇద్దరు ఒలంపిక్స్ లో రెండేసి పథకాలు అందుకున్న వారే. ఇద్దరికీ తమ క్రీడాంశాల్లో  ఘనమైన చరిత్రే ఉంది. కాలగమనంలో సుశీల్ కుమార్ పేరు మాత్రం పాతాళానికి పడిపోతే..  పీవీ సింధు పేరు మాత్రం భారతదేశ చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2016 రియోలో రజతం సాధించిన పివి సింధు, ఐదు సంవత్సరాల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిసి, దేశం గర్వపడేలా చేసింది. సరిగ్గా ఇలాంటి ఫీట్ నే సుశీల్ కుమార్ కూడా నమోదు చేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్యం ఒడిసిపట్టిన సుశీల్ 2012 లండన్ ఒలంపిక్స్ లో రజితం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్ర్యానంతరం భారతదేశం నుంచి వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన వ్యక్తుల్లో సుశీల్ కుమార్ మాత్రమే సొంతం చేసుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ యొక్క ఘనతను మహిళల విభాగంలో పివి సింధు కూడా సాధించింది. ఇక ఇద్దరి జీవితాలు ఒకసారి పరిశీలిస్తే సింధు తన ప్రతిభతో  మరింత పేరు సంపాదించుకోగా, 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత సుశీల్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. 2012 లండన్ ఒలంపిక్స్ లో సుశీల్ రజతం నెగ్గిన తర్వాత దేశంలో ఎంతో మంది యువతకు ఆదర్శం అయ్యారు.  భారత రెజ్లింగ్ లో ఘనత సాధించినా, ప్రస్తుతం వివాదాలతో సతమతమవుతున్నారు.

అతనికి ఉన్న అహం, ఇతర క్రీడాకారులపై  ఉన్న చిన్న చూపు వంటి అంశాలు ఆయనను కిందకు తొక్కే సాయి. కానీ సింధు రజతం సాధించిన మరుసటి రోజే సుశీల్  కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జిషీట్లోకీ ఎక్కాడు. పీవీ సింధు విషయానికి వస్తే టోక్యో ఒలింపిక్స్ లో ఆమెపై ఉన్న క్రేజ్ మరింత ఎక్కువైపోయింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు ఇలా ఏ టోర్ని చూసుకున్న ఆమె సాధించని పథకాలు లేవు. 2004 నుంచి బ్యాట్మెంటన్ కటోర  సాధన చేస్తూ 2016 రియో ఒలంపిక్స్ లో రజతం సాధించిన తర్వాత ఆమె ఇంకా సాధించాల్సింది ఏముంది అనుకుంటే ఈరోజు ఇంకో విధంగా ఉండేది. కానీ సింధూ అలా అనుకోకుండా  చాలా కష్టపడి మరోసారి సత్తా చాటి దేశంలో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: