కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం t20 వరల్డ్ కప్ జరుగుతుందా లేదనే ఊహాగానాలకు ఈ మధ్యనే ఐసీసీ t20 వరల్డ్ కప్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తేల్చి చెప్పింది. అందులో భాగంగానే మ్యాచ్ ల షెడ్యూల్ ను కూడా అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇందులో పాల్గొనే కంట్రీస్ ఒక్కొక్కటిగా ఈ ప్రపంచ కప్ లో పాల్గొనే జట్లను ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా బీసీసీఐ కూడా భారత్ టీంను రాత్రి అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఈ టీం లో సంచలన నిర్ణయాలు తీసుకుంది అని చెప్పాలి. ప్రకటించిన జట్టులో కొన్ని సంచలన మరియు సాహసోపేతమైన నిర్ణయాలు ఉన్నాయని అప్పుడే విమర్శలు జోరందుకున్నాయి.

అంతర్జాతీయంగా ఎక్కువ అనుభవం లేని ఆటగాళ్లను సెలెక్ట్  చేయడం పట్ల అభిమానులు మరియు క్రికెట్ విశ్లేషకులు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడనున్న ఇండియా టీమ్ లో జార్ఖండ్ డైనమైట్ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇందులో బాగంగా కానున్నాడు. మరి ఈ పాత్రలో అని అనుకుంటున్నారా ? ఎలాగూ అన్ని ఫార్మాట్ ల నుండి ధోనీ రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ప్లేయర్ గా ఆదే అవకాశం లేదు. అయితే ఈ ఇండియన్ టీమ్ కు మెంటార్ గా వ్యవహరించనున్నారు. మరి ఒక కెప్టెన్ గా ఎప్పటి నుండి ఊరిస్తున్న వన్డే వరల్డ్ కప్ ను సాధించి పెట్టిన ధోనీ, ఇప్పుడే మెంటార్ గా కూడా టీ 20 వరల్డ్ కప్ ను సాధించి పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది.

మహేంద్ర సింగ్ ధోనీ లో ఆటపై ఉన్న అపారమైన జ్ఞానమే తనకు ఈ అవకాశాన్ని కల్పించిందని ప్రముఖ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి అభిమానుల కోరికను ధోనీ తీరుస్తాడా లేదా అన్నది తెలియాలంటే అక్టోబర్ నెల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: