ఐపీఎల్ 2021 రెండవ దశలో.. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపుతోంది.  ఈ రెండవ దశలోకి... వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి టాప్ పొజిషన్ కు వెళ్ళింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. నిన్న జరిగిన ఐపీఎల్ 36వ మ్యాచ్ లో... ధోనీసేన బెంగళూరు జట్టుపై ఆరు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే....  టాస్ ఓడిన బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు... 20 ఓవర్లు ఆడి... ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. 

ఇక బెంగళూరు బ్యాట్స్మెన్లలో కోహ్లీ 53 పరుగులు మరియు దేవ దత్  పడిక్కల్ 70 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. గట్టు 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. కేవలం 18. 1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక ఇందులో  రుతురజ్ గైక్వాడ్ 38 పరుగులు మరియు అంబటి రాయుడు 32 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక.. మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.

నాలుగో ఓవర్లు వేసిన బ్రావో... మూడు వికెట్లు తీసి.. బెంగళూరు జట్టు నువ్వు కష్టాల్లో చేర్చాడు. అయితే బ్రావో బౌలింగ్ ఫై... మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్వేన్‌ బ్రావో తిరిగి ఫామ్‌ లోకి వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ధోని.  ''నేను బ్రావోను సొంత బ్రదర్‌ లాగా పిలుస్తాను. బ్రావో చాలా నెమ్మదిగా బంతులు వేయాల్సిన అవసరం ఉందా ? లేదా ? అనేదానిపై మాకు ప్రతి సంవత్సరం పోరాటం ఉంటుంది. బ్రావో తిరిగి ఫామ్‌ లోకి వచ్చి..  జట్టుకు మరింత బలాన్ని చేకూర్చాడు.  బెంగుళూరు జట్టు కీలక వికెట్లు తీసి..  చెన్నైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు బ్రావో.  బ్రావో వేసే స్లో మరియు యార్కర్ల కారణంగా అది సాధ్యమైంది.  ఇలాంటి బౌలర్‌ ఉంటం అదృష్టం'' అంటూ ధోని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

csk