యూఏఈ లో షార్జా వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో 44వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-సన్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈరోజు జరిగింది. అయితే ఈ మ్యాచ్లో 135 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ఇక లక్ష్యఛేదనను అద్భుతంగా ఆరంభించింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు ఓపెనర్లు  రుతురాజ్ గైక్వాడ్,  ఫాఫ్ డు ప్లెసిస్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత 45 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్  రుతురాజ్ గైక్వాడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జాసన్ హోల్డర్ వెన్నకి పంపించాడు. దాంతో చెన్నై లక్ష్య ఛేదన నెమ్మదించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఆల్ రౌండర్ 17 కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలానికి వెనుదిరగక తప్పలేదు.  ఆ తర్వాత ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్ అయినా సురేష్ రైనా ను 2 పరుగులకే వెనక్కి పంపించాడు. అదే ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ అయినా డు ప్లెసిస్ 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ ఓవర్ తో అప్పటివరకు చెన్నై వైపు వెళ్తున్న మ్యాచ్ ను ఒక్కసారిగా మధ్యలో ఆపేసాడు జాసన్ హోల్డర్. అయితే వికెట్లు పడడం ఆరంభం కావడంతో 13 ఓవర్ నుండి 19 వరకు చెన్నై సూపర్ కింగ్స్ నెమ్మదిగా ఆడటంతో ఒక బౌండరీ కూడా సాధించలేదు. ఇక అప్పటికే క్రీజ్లో ఉన్న అంబటి రాయుడు, ఎంఎస్ ధోని మెల్లి మెల్లిగా జట్టును విజయం వైపుకు తిఉసుకెళ్తున్నారు, అయితే లక్ష్యం చిన్నది కావడంతో మ్యాచ్ మొదటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ వైపే ఉంది. ఇక చెన్నై జట్టుకు చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు కావాల్సి ఉండగా అంబటి రాయుడు ఒక సిక్స్కొట్టి జట్టుపై పెరిగిన భారాన్ని తగ్గించాడు. అలాగే కెప్టెన్ ధోని ఓ బౌండరీ బాదంతో చెన్నైకి 19వ ఓవర్లో 13 పరుగులు లభించాయి. దాంతో సూపర్ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో మూడు పరుగులు మాత్రమే కావలసి ఉంది. ఆ సమయంలో రాయుడు మొదటి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేసి కెప్టెన్ ధోనీకి స్ట్రైక్ ఇచ్చాడు. అయితే క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్ గా పేరొందిన ఎంఎస్ ధోని తన స్టైల్లో ఒక్క సిక్స్త్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ విజయంతో ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుం.ది అలాగే సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుండి వైదొలిగింది. ఈ ఐపీఎల్ లో మొత్తం 11 మ్యాచులు ఆడిన హైదరాబాద్ తొమ్మిది మ్యాచ్ లో ఓడిపోగా... 11 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదింటిలో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

csk