కరోనా కారణంగా యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు చివరి దశకు వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ప్లే ఆఫ్ కోసం కీలకమైన మ్యాచ్లలో ఇది కూడా ఒకటి. అందుకే ఈ మ్యాచ్లో రెండు జట్లు విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి.

అయితే ముంబై జట్టులో ఓపెనర్లు అయినా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ చెప్పుకోదగిన ప్రదర్శన చేయడం లేదు, అలాగే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా ఫామ్ లో లేరు. కానీ గత ఏడాది ఐపీఎల్లో అంతగా ఆకట్టుకొని సౌరభ్ తివారి ఈ ఏడాది ఐపిఎల్ లో మంచి ఫామ్ కనబరుస్తున్నారు. కీలకమైన సమయంలో పరుగులు చేస్తూ జట్టు విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక పాండ్య బ్రదర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో నిరాశ పరుస్తూ ఉన్నారు. కానీ హార్దిక్ పాండ్యా పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్లో 30 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కాబట్టి పాండ్య బ్యాట్ తో రాణించడం ముంబై కి ఈ మ్యాచ్ లో కలిసివస్తుంది. అలాగే బ్యాటింగ్ లో రాణించిన లేక పోతున్నా కిరన్ పోలార్డ్ బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేస్తుండడం ముంబాయి కి కలిసి వచ్చే అంశం. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్లో అద్భుతంగా రాణించిన ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్లో అంతగా ప్రభావం చూపలేక పోతున్నారు. ఇక ప్రపంచ కప్ కి సెలెక్ట్ అయిన రాహుల్ చహర్ ది కూడా అదే పరిస్థితి.

ఇక ఢిల్లీ జట్టు విజయానికి వస్తే ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. బ్యాటింగ్ లో ఓపెనర్లు షా, ధావన్ పర్వాలేదు అనిపిస్తున్న కెప్టెన్ పంత్, మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నారు, కానీ మిగిలిన వారు బ్యాట్ తో పరుగులు చేయలేకపోవడంతో వీరిరువురి పైనే భారం పడుతుంది. ఒకవేళ వీరు తొందరగా పెవిలియన్ చేరుకుంటే ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమవుతోంది. కానీ ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ బౌలింగ్ అద్భుతంగా ఉంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా వారు తమ కట్టుదిట్టమైన బంతులతో కాపాడుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో అరంగేట్రం చేసిన పేసర్ ఆవేశ్ ఖాన్ ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా... మొత్తం ఐపీఎల్ 2021 అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ లలో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లో విఫలమైనప్పుడు బౌలింగ్ తో బౌలింగ్ లో విఫలమైన సమయంలో బ్యాటింగ్ తో రాణిస్తూ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటుంది.

ఇక ముంబై-ఢిల్లీ ప్రదర్శనలు చూస్తే నేడు ఢిల్లీ దే విజయం అనిపిస్తుంది. కానీ ముంబై జట్టులో హార్డ్ హీటర్లు చాలా మంది ఉన్నారు. వారు ఏ క్షణమైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది

మరింత సమాచారం తెలుసుకోండి: