క‌ల‌కత్త నైట్ రైడ‌ర్స్ కు కింగ్స్ పంజాబ్ జ‌ట్టు ల‌కు శుక్ర‌వారం మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ లో క‌ల‌క‌త్త పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడ తో విజ‌యం సాధించింది. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కేవ‌లం 55 బంతుల్లో నే 67 పరుగులు చేయ‌డం తో పంజాబ్ సులువు గా విజ‌యాన్ని అందుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ప్లే అఫ్స్ అవ‌కాశాలు కాస్త మెరుగు ప‌డ్డాయి. అలాగే క‌లక‌త్త‌కు కూడా ప్లే అఫ్ల్స్ కు చేరే వ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెల‌వ‌డానికి ఆ జ‌ట్టు ఆట‌గాళ్లే కాకుండా థ‌ర్డ్ అంపైర్ కూడా స‌హ‌క‌రించాడ‌ని నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. అస‌లు పంజాబ్ జ‌ట్టు కేవ‌లం థ‌ర్డ్ అంపైర్ వ‌ల్లే విజ‌యం సాధించింద‌ని కామెంట్స్ పెడుతున్నారు.



అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. క‌లకత్త బౌల‌ర్స్ వేసిన ప్ర‌తి బంతిని చురుకు గా బౌండ‌రీలు పంపిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో  18వ ఓవ‌ర్ ను శివం మావీ వేశాడు. అయితే ఈ ఓవ‌ర్ లో 4 బంతి ని కెఎల్ రాహుల్ లెగ్ సైడు వైపు బ‌లంగా కొట్టాడు. అయితే బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఫీల్డ‌ర్ రాహుల్ త్రిపాఠి అద్భుతంగా డ్రైవ్ చేసి క్యాచ్ అందు కున్నాడు. కానీ ఫీల్డ్ అంవైర్లు త‌మ నిర్ణ‌యాన్ని స్ప‌ష్టం గా చెప్ప‌క పోవ‌డంతో థ‌ర్డ్ అంపైర్ రంగంలో కి దిగాడు. థ‌ర్డ్ అంపైర్ ప‌లు మార్లు త్రిపాఠి డ్రైవ్ ను ప‌రిశీలించి నాట్ అవుట్ గా ప్ర‌క‌టించారు. అయితే ఈ నిర్ణ‌యం పై ప్ర‌స్తుతం భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డ బంతి నేల కు త‌గ‌ల లేదు అని.. అక్క‌డ క్యాచ్ క్లీయ‌ర్ క‌ట్ గా ఉంద‌ని క్రికెట్ మేధావులు అంటున్నారు. థ‌ర్డ్ అంపైర్ దీనిపై త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌న మండి ప‌డుతున్నారు. అయితే ఆ బంతి కి  కెఎల్ రాహుల్ ను అవుట్ ఇస్తే మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేది. దీంతో పంజాబ్ గెలుపు థ‌ర్డ్ అంపైర్ వ‌ల్లే సాధ్య మైంద‌ని నెటిజ‌న్లు ట్వీట్ట‌ర్ వేదిక‌న ట్రోల్స్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: