ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ - ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఆ జట్లలోని డ్వేన్ బ్రావో మరియు శిఖర్ ధావన్ వంటి స్టార్ ఆటగాళ్లు కొన్ని రికార్డుల పై కన్నేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన వెటరన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో టీ 20 క్రికెట్‌లో 550 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచేందుకు దగ్గరగా ఉన్నాడు. బ్రావో ఈ రికార్డుకు కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తిగా అవతరించడానికి బ్రావో కు ఇంకా 3 వికెట్లు కావాలి.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడితే... ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు కోసం 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాదిగ నిలుస్తాడు. అలాగే ఈ ఐపీఎల్ టీ 20 లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలవడానికి కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ ఢిల్లీ స్పిన్నర్ ఇప్పటి వరకు 166 వికెట్లు తీశాడు. అయితే ఐపీఎల్ లో 170 వికెట్లతో మొదటి స్థానంలోశ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఉన్నాడు.

ఇక శిఖర్ ధావన్ తన ఢిల్లీకి ఫ్రాంచైజీ కోసం 2000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన నాల్గవ ఆటగాడిగా నిలవడానికి కేవలం 59 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ తర్వాత 800 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు సాధించడానికి ఈ ఢిల్లీ ఓపెనర్ కు ఇంకో 38 పరుగులు కావాలి. చూడాలి మరి ఈ ఆటగాళ్లు తమ రికార్డులను ఈ మ్యాచ్ లో చేరుకుంటారా.. లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: