ప్రో క‌బ‌డ్డి కి దేశ వ్యాప్తంగా రోజు రోజు కు ఆధ‌ర‌ణ పెరుగుతూనే ఉంది. ప్రో క‌బడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సీజ‌న్ ల‌ను పూర్తి చేసుకుంది. చివ‌రి సారి గా జ‌రిగిన ఏడో సీజ‌న్ ప్రో క‌బ‌డ్డి లీగ్ క‌ప్ ను బెంగాల్ వారియ‌ర్స్ జ‌ట్టు గెలుచుకుంది. ఈ ఏడో సీజ‌న్ 2019 లో నే జ‌రిగింది. దీని త‌ర్వాత ఎన‌మిదో సీజ‌న్ 2020 జ‌రాగాల్సి ఉంది. కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి విప‌రీతంగా ఉండ‌టం తో పాటు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించ‌డం వ‌ల్ల పోయిన ఏడాది జ‌రగాల్సిన ప్రో క‌బ‌డ్డి ఎన‌మిదో సీజ‌న్ నిర్వ‌హ‌కులు ర‌ద్దు చేశారు. దీని త‌ర్వాత మ‌ళ్లి నిర్వ‌హించ‌డానికి ప్రో క‌బ‌డ్డి నిర్వ‌హ‌కులు చాలా ప్ర‌య‌త్నించారు. కానీ మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల సాధ్యం కాలేదు. అలాగే కొద్ది రోజుల త‌ర్వాత క‌రోనా వైర‌స్ రెండో ద‌శ వ్యాప్తి కూడా రావ‌డం తో ఈ టోర్ని నిర్వ‌హించ‌డానికి నిర్వ‌హాకుల‌కు వీలు కాలేదు.



అయితే తాజా గా ప్రో క‌బడ్డి లీగ్ నిర్వ‌హించ‌డానికి నిర్వ‌హ‌కులు ముందుకు వ‌చ్చారు. ఈ ఏడాది లోనే లీగ్ ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. దీనికి సంబంధించిన విష‌యాల‌ను ప్రో క‌బ‌డ్డి లీగ్ క‌మిష‌న‌ర్, మ‌శాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుప‌మ్ గో స్వామి తెలిపారు. ప్రో క‌బడ్డి లీగ్ ను ఈ ఏడాది డిసెంబ‌ర్ 22 నుంచి నిర్వహి స్తామ‌ని తెలిపారు. అలాగే ఈ ఎన‌మిదో సీజన్ మొత్తం ఒకే వేదిక లో నే నిర్వ‌హిస్తామ‌ని అన్నారు. అది కూడా క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగళూర్ నగ‌రంలోనే నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే ప్లేయ‌ర్ల ఆరోగ్య ప‌ర‌మైన అంశాలు, అలాగే ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త ల దృష్ట్య  క్రీడా మైద‌నంలోకి ప్రేక్ష‌కుల‌ను  అనుమ‌తించ బోమ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఈ సీజ‌న్ కు సంబందించి ఇప్పటికే వేలం పాట ను కూడా నిర్వ‌హించారు.  అయితే ఈ సారి తెలుగు టైట‌న్స్ వైపు సిద్దార్థ్ శీరిష్ దేశాయ్ ఆడ‌నున్నాడు. ఇత‌న్ని గ‌తంలో నిర్వ‌హించిన వేలంలో రూ. 1.30 కోట్ల ను వెచ్చించి సొంతం చేసుకుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: