ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20 21 సీజన్లో అబుదాబి వేదికగా ఈరోజు పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాట్స్మెన్స్ ను పంజాబ్కింగ్స్ బౌలర్లు అడ్డుకున్నారు దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్ అయితే మొదట ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ గా వెనుదిరిగాడు/ ఆ వెంటనే రాబిన్ ఊతప్ప రెండు పరుగులు చేసి అంబటి రాయుడు నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు/ ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఎంఎస్ ధోని 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చివరి వరకు నాటౌట్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డుప్లెసిస్ 55 బంతుల్లో 76 పరుగులు చేసి ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరవ అర్ధ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో డుప్లెసిస్
ఔట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ 134 పరుగులకే పరిమితమైంది. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, అర్ష్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా  రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ ఒక్కో వికెట్ పడగొట్టారు, ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానానికి చేరుకోవాలి అంటే పంజాబ్ కింగ్స్ జట్టును 134 పరుగుల కంటే తక్కువ పరుగులకే కట్టడి చేయాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ విజయంతో ముగించాలి అనుకుంటున్నా పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో 135 పరుగులు అవసరం. చూడాలి మరి పంజాబ్ కింగ్స్ విజయంతో ఈ సీజన్ ముగిస్తుందా లేదా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: