ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమై ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్ లోని లీగ్ మ్యాచ్లు ఈరోజుతో ముగియానున్నాయి. అయితే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని లీగ్ దశలోని ఆఖరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్న విషయం తెలిసిందే. కానీ బెంగళూరు జట్టు టాప్ 2 లోకి వెళ్ళాలి అనుకుంది. కానీ గత మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చేతిలో ఓడిపోవడంఎంతో ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఆ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై పంజాబ్ చేతిలో ఓడింది గనక మళ్ళీ ఈ రోజు కోహ్లీ జట్టు ఢిల్లీ పై విజయం సాధిస్తే వారు టాప్ 2 లోకి తప్పకుండ వెళ్లేవారు. ఢిల్లీ జట్టులో బౌలింగ్ అద్భుతంగా ఉన్నా బ్యాటింగ్ లో మాత్రం కొంత వెనకబడుతోంది .భారత్లో అదరగొట్టిన డిల్లీ బ్యాట్స్ మెన్స్ యూఏఈ లో వెకనబడుతున్నారు. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ లతో పాటుగా కెప్టెన్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కూడా పరుగులు చేయడానికి కష్టపడాల్సి వస్తుంది, కానీ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్ రాణిస్తున్నాడు. అలాగే మిగతా బౌలర్లు అతనికి సహకారం అందిస్తున్నారు.

ఇక బెంగళూరు జట్టుకు కూడా బ్యాటింగ్ సమస్యగా ఉంది. ఆ జట్టులో మ్యాక్స్వెల్ ఒక్కడే బ్యాట్ తో రాణిస్తుంటే కెప్టెన్ కోహ్లితో సహా మిగిలిన వారందరూ విఫలమవుతున్నారు. అందువల్ల జట్టు భారీ పరుగులు చేయలేకపోతోంది. ఇక బౌలింగ్ లో హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. అయితే గత మ్యాచ్ల ప్రదర్శన బట్టి చూస్తే ఈరోజు జరిగే మ్యాచ్లో లో ఢిల్లీ విజయం అని చెప్పాలి. కానీ బెంగళూరు జట్టు కూడా ఏం తక్కువ కాదు. కాబట్టి చూడాలి ఈరోజు ఎవరు విజయం సాధిస్తారు అనేది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: