ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఈ నెల 15న ముగియనుంది. ఆ తర్వాత ఈనెల 17 నుండి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఇందులో మొదట క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆ తర్వాత వార్మప్ మ్యాచ్ లు ఉంటాయి. అయితే ఇప్పటికే ఈ ప్రపంచం కప్ కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఈ వార్మప్ మ్యాచ్లో పాల్గొంటాయి. అయితే ఆ తర్వాత ఈ నెల 24న క్రికెట్ ప్రపంచంలో చిరకాల ప్రత్యర్ధులుగా పేరొందిన భారత్-పాకిస్థాన్ జట్లు ఈ టోర్నమెంట్లో తమ మొదటి మ్యాచ్ లోనే ఎదురు పడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఈ రెండు దేశాల అభిమానులు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు వచ్చే ప్రజాధరణ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు కూడా ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే వన్డే ప్రపంచకప్ లో కానీ టి20 ప్రపంచ కప్ లో కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ భారత్ ను ఓడించ లేకపోయింది. ఇక తాజాగా జరుగనున్న ఈ ప్రపంచ కప్ మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు మన భారత జట్టును ఓడించి జరిగితే వారికి బహుమతిగా బ్లాంక్ చెక్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించాడు. అయితే భారత్ పై విజయం సాధిస్తే తమ జట్టుకు బ్లాంక్ చెక్ అందిస్తానని దానిపై తమకు ఇష్టం వచ్చిన అంత అమౌంట్ రాసుకోవచ్చు అని ఓ పారిశ్రామికవేత్త తనతో చెప్పినట్లు రమీజ్ రాజా వెల్లడించాడు. అయితే ఆ పారిశ్రామిక వేత్త ఎవరు అనేది చెప్పలేదు. అయితే పాకిస్తాన్ బోర్డ్ చైర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ అభిమానులు తన స్టైల్ లో విరుచుకుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: