ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ లోని లీగ్ దశలోని మ్యాచ్లకు ఇవ్వాళ ఆఖరి రోజు. ఈ రోజు తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లోని లీగ్ దశలో మ్యాచ్ లు ముగియనున్నాయి. అయితే ఈ రోజు ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ కు రానుంది. ఐపీఎల్ 2021 ఇప్పటికే ఢిల్లీ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ఆ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏ మార్పు లేకుండా వస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అలాగే మార్పు లేకుండానే వస్తుంది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 2 లోకి వెళ్లంటే ఢిల్లీ జట్టును 121 పరుగుల తేడాతో ఓడించాలి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కానీ ఈ సీజన్ లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టును అంత భారీ పరుగుల తేడాతో ఓడించడం చాలా కష్టం. కానీ క్రికెట్ లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

ఢిల్లీ జట్టు : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (wk/c), రిపాల్ పటేల్, షిమ్రాన్ హెట్మెయర్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే

బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (wk), డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

మరింత సమాచారం తెలుసుకోండి: