ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 సీజన్లో ఈ రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు ఈ జట్టు ఓపెనర్ లు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరగా ఆ వెంటనే 48 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయితే శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. కానీ చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ 22 బంతుల్లో 23 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేయగలిగింది. అలాగే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ లో బెంగరులు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రేంజు వికెట్లు పడగొట్టగా డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక్క వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ  కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవాలంటే 165 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్లో గెలిచిన, ఓడిన ఢిల్లీ బెంగళూరు జట్లపై అది పెద్ద ప్రభావం చూపించదు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ బెంగళూరు ఐపీఎల్ 2021 లో పాలీ ఆఫ్స్ లోకి వెళ్లాయి. కానీ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ లోకి వెళితే బాగుంటుందని రెండు జట్లు భావిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: