భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంటేనే ప్రపంచంలోని ఏ దేశంలోనైన ఉన్న క్రికెట్ కంట్రోల్ బోర్డుల కంటే అన్ని రకాలుగా బలమైనది. ముఖ్యంగా మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దగ్గర ఉన్న ధన బలం వేరే క్రికెట్ కంట్రోల్ బోర్డు దగ్గర లేదు. చివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దగ్గర కూడా లేదు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు వచ్చే ఆదాయంలో 70 శాతంకు పైగా మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దగ్గరనుండి వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు .ఆ కారణంగానే ఐసీసీ ఎప్పుడు బీసీసీఐకి మద్దతుగా వ్యవహరిస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అది పక్కకు పెడితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయిన రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా రమీజ్ రాజా మాట్లాడుతూ... పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు 50 శాతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇదే ఫండింగ్ ద్వారానే నడుస్తుంది అని చెప్పాడు. కానీ ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయం, ఫండింగ్ ద్వారా 90 శాతం నడుస్తుంది అని గుర్తుచేశాడు. అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే తమ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డును నడిపిస్తుంది అని కూడా రమీజ్ రాజా అన్నాడు. భారత ప్రధాని మోడీ తనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ఈ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు మూయించేయగలడు అనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే పాకిస్తాన్. భారత్ రెండు జట్లు దేశాల మధ్య ఉన్న సమస్యల కారణంగా ద్వైపాక్షిక సిరిసిల్లలో పాల్గొంటావు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం పాల్గొంటాయి. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తున్న 2021 టి20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు అక్టోబర్ 24న ఎదురు పడుతుండటంతో అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. అయితే ఆ మ్యాచ్లో మన భారత జట్టుపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించగలదు లేదా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: