కరోనా కష్టాల మధ్య ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో నేడు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్... అలాగే ప్రస్తుత భారత యువ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి అయితే ఈ ఏడాది ఐపిఎల్ లో మొత్తం పది విజయాలు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కి వస్తే... 9 విజయాలు సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి వచ్చింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో ఆడిన చివరి మూడు మ్యాచ్లలో పరాజయం పొందగా ఢిల్లీ క్యాపిటల్స్ చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. అయితే ఈ రెండు జట్లలో ఈరోజు విజయం సాధించిన జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో నేరుగా ఫైనల్స్ కు చేరుకుంటుంది. అలాగే ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ 2 లోకి వెళుతుంది. అక్కడ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో తలపడనుంది. అందులో గెలిచిన వారు ఈరోజు గెలిచిన జట్టుతో ఫైనల్స్ లో తలపడతారు. అయితే ఈ రెండు జట్లు పోటీపడ్డ గత నాలుగు మ్యాచ్ లను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. ఆ నాలుగింటిలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే ఈరోజు ఎవరు విజయం సాధిస్తారు. ఎవరు నేరుగా ఫైనల్స్ కి వెళ్తారు ఎవరి క్వాలిఫైయర్ 2 లోకి వెళ్తారు అనేది చూడాలి.

చెన్నై జట్టు (అంచనా) : ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేష్ రైనా, ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, జోష్ హాజెల్‌వుడ్

ఢిల్లీ జట్టు (అంచనా) : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రిపాల్ పటేల్/మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మైర్, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్

మరింత సమాచారం తెలుసుకోండి: