యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో మొదటి క్యాలిఫైర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగుతుంది. అయితే ఈ రెండు జట్లు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో లీగ్ దశలో ఎదురుపడినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచ్లలో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. అంతేకాకుండా గత ఏడాది ఐపిఎల్ లో కూడా ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తన ఆధిపత్యం కొనసాగింది. కానీ ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ లో ఎదురు పడిన ప్రతిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఇంకా ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు రానుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి మార్పులు లేకుండా వస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క మార్పుతో వస్తుంది. అయితే ఈ మ్యాచ్లో విజయం ఏ జట్టు సాధిస్తే ఆ జట్టు నేరుగా ఐపీఎల్ 2021 ఫైనల్ లోకి వెళుతుంది. అలాగే ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ 2 లోకి వస్తుంది. కాబట్టి ఎలాగైనా విజయం సాధించి నేరుగా ఫైనల్ లోకి వెళ్లాలని చూస్తున్నాయి ఢిల్లీ, చెన్నై రెండు జట్లు.


ఢిల్లీ జట్టు : శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (wk/c), శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్, టామ్ కుర్రాన్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే

చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ధోని (wk/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

మరింత సమాచారం తెలుసుకోండి: