యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఈ ఉత్కంఠ పోరాటాలలో ఏదో ఒక జట్టు విజయం సాధిస్తుంది... ఓ జట్టు పరాజయం పొందుతుంది అనే విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విజయ అపజయాలను అభిమానులు సరిగా చూడటం లేదు. తమ జట్టు... తాము అభిమానించే జట్టు ఓడిపోతే ఫిక్సింగ్ చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారికి తోచిన ఊహ కథనాలతో ఏదో ఒక స్టోరీ అల్లి దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్ జట్ల గెలుపోటములలో ఈ కామెంట్స్ వస్తున్నాయి.

అయితే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మొదటి క్వాలిఫై మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే, అయితే దీనిపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అభిమానులు. ఢిల్లీ జట్టు ఏం ఫిక్సింగ్ చేసిందని కావాలనే ఓడిపోయిందని అంటున్నారు. అయితే చివరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా కెప్టెన్ పంత్ బంతిని టామ్ కర్రన్ చేతికి ఇచ్చాడు. అయితే అప్పటికి ది డేంజరస్ పేసర్ కగిసో రబాడాకు ఒక్క ఓవర్ మిగిలి ఉంది. అయిన రబడాకు ఇవ్వకుండా కర్రన్ కు ఇచ్చాడు. ఇక కర్రన్ ఆ 13 పరుగులను కాపాడడంలో విఫలమయ్యాడు. దాంతో ఢిల్లీ ఫిక్సింగ్ చేశారని అందుకే రబడాకు ఇవ్వకుండా కర్రన్ కు బౌలింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.

దీనిపై తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సమయంలో అభిమానులు అనవసరమైన కామెంట్స్ చేసారు. క్వాలిఫైయర్ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయిన సమయంలో కూడా అభిమానులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరికి నచ్చిన టీంకు వారు సపోర్ట్ చేయటం మంచిది.... కానీ వారి టీం ఓడిపోయి ఇతర జట్లు విజయం సాధించినప్పుడు దానిని గౌరవించాలి. వారు ఎలా ఆడారో తెలుసుకోవాలి. అంతేగాని ఇటువంటి సొల్లు వ్యాఖ్యలు చేయకూడదు అని పఠాన్ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: