ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నిన్న.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై కేకేఆర్ జట్టు అద్భుత విజయం సాధించిన సంగతి మనకు విధితమే. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు 138 పరుగులు చేయగా... ఆ లక్ష్యాన్ని.. చాలా జాగ్రత్తగా ఆడుతూ చేధిoచింది కేకేఆర్ జట్టు. దీంతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు దూసుకు వెళ్ళింది కేకేఆర్ జట్టు. ఇదిలా ఉండగా నిన్న జరిగిన మ్యాచ్ లో.. ఆర్సిబి విధ్వంసకర బ్యాట్స్మెన్ గ్లెన్ మాక్స్ వెల్ ఓ అరుదైన రికార్డుని తన సొంతం చేసుకున్నాడు. 

ఐపీఎల్ 2021 సీజన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  తరపున 500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మరియు డివిలియర్స్ త్రయం కాకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 500 పరుగులు చేసిన రెండవ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు మాక్స్ వెల్. ఇక  ఆర్సిబి తరుపున 2010 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 572 పరుగులు చేసి  రికార్డు సృష్టించాడు జాక్ కలిస్. అయితే తాజాగా ఈ సీజన్లో 500 పరుగులు చేసి జాక్ కలిస్... సరసన చేరిపోయాడు మ్యాక్స్ వెల్.

అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హర్షల్ పటేల్ కూడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  ఈ సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడి ఏకంగా 32 వికెట్లు పడగొట్టి  రికార్డు సృష్టించాడు పటేల్. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ద్వేన్ బ్రావో రికార్డును బ్రేక్ చేశాడు పటేల్. అంతకు ముందు 2013 సీజన్ లో బ్రావో 32 వికెట్లు తీసి చరిత్ర సృష్టించగా... ఆ రికార్డును ఈ సీజన్ లో హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఇక వీరిద్దరి తర్వాత స్థానంలో రబడా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb