ఈ ఏడాది ఐపీఎల్ లో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు హర్షల్ పటేల్. ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న హర్షల్ పటేల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కానీ ఈ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. కానీ సమం చేసాడు. నిన్న ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో అతని జట్టు 2021 సీజన్ నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో హర్షల్ తన 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి తన ఐపిఎల్ 2021 ప్రయాణాన్ని 32 వికెట్లతో ముగించాడు మరియు ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ 2013 సీజన్‌లో హర్షాల్ సమం చేసిన అద్భుతమైన ఫీట్ సాధించాడు.

అయితే బెంగరులు రైట్ ఆర్మ్ పేసర్ తన చివరి ఓవర్‌లో సునీల్ నరైన్ కు వేసిన డెలివరీని నెమ్మదిగా మిడ్-ఆన్ వైపు తిప్పినప్పుడు బ్రావో రికార్డును బ్రేక్ అవకాశం లభించింది, కానీ దేవదత్ పడిక్కల్ క్యాచ్‌ను వదిలి పెట్టాడు. దాంతో అతనికి 33 వ వికెట్ లభించలేదు. అయితే గత నెలలో దుబాయ్‌లో ముంబై ఇండియన్స్‌ పై ఈ సీజన్‌లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్ హర్షల్ పటేల్. అలాగే ఈ సీజన్ లో ఇప్పటివరకుఐదు వికెట్లు ముగ్గురులో అతను కూడా ఒకడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్,  కోల్ కతా నైట్ రైడర్స్ యొక్క ఆండ్రీ రస్సెల్ తో కలిసి ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: