మొన్నటి వరకు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచిన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.  ఈ సీజన్ ఐపీఎల్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే జరగబోతున్నాయి.  ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టుపై అనూహ్యమైన విజయాన్ని సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.  ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో ఆడి ఢిల్లీ క్యాపిటల్స్  మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.  అయితే ఇటీవలే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బెంగళూరు జట్టు మరోసారి నిరాశ పరిచింది.



 ఎన్నో ఏళ్ల తర్వాత ప్లే ఆప్ కి అర్హత సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.  ఇక జట్టు దూకుడు చూస్తే అందరూ టైటిల్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో ఈసారి కూడా అభిమానుల ఆశలు అన్నీ కూడా నిరాశ గానే మిగిలిపోయాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ అదే జట్టులో ఉన్న బౌలర్ హర్షల్ పటేల్ మాత్రం ఐపీఎల్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఔరా అనిపించాడు.




 ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో ఏకంగా అంచనాలకు మించి హర్షల్ పటేల్ రాణించి అందరి చూపులు ఆకర్షించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే  ఇటీవల అరుదైన ఘనత అందుకున్నాడు. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా హర్షల్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ 15 మ్యాచ్లు ఆడిన 30 ఏళ్ల హర్షల్ పటేల్ 32 రెండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హాట్రిక్ కూడా ఉండడం గమనార్హం. దీంతో 2013లో ఓకే ఐపీఎల్ సీజన్ లో ముప్పై రెండు వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్  బ్రావో రికార్డును సమం చేశాడు హర్షల్ పటేల్.  యువ బౌలర్ ప్రతిభకు క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl