ఐపీఎల్ సీజన్ 14 ఇంకో రెండు మ్యాచ్ లతో ముగిసిపోనుంది. అందులో భాగంగా ఈ రోజు క్వాలిఫైయర్ 2 మరి కొన్ని గంటల్లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం శుక్రవారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో కప్ కోసం పోటీ పడనుంది. అయితే అక్కడ వరకు వెళ్లాలంటే ముందు ఈ రోజు సమరంలో గెలవాలి. రెండు జట్లు కూడా ఎంతో ఒత్తిడిలో ఉన్నాయి అని చెప్పాలి. క్వాలిఫైయర్ 1 లో చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ చేసిన కొన్ని పొరపాట్లు తనకు మ్యాచ్ ను దూరం చేశాయి. లేకుంటే ఈ రోజు ఫైనల్ లో ఢిల్లీ ఉండేది. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఆ తప్పులను సరిదిద్దుకుంటుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగక తప్పదు.

ఈ రోజు మ్యాచ్ జరగబోయేది షార్జా లోనే, కాబట్టి ఇరు జట్లు ప్రతి ఒక్క నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టు మోనా మ్యాచ్ లాగా బ్యాటింగ్ తీసుకుంటే గెలుపు అవకాశాలకు దాదాపు తెరపడినట్లే అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ పిచ్ మ్యాచ్ జరిగే కొద్దీ నెమ్మదిగా మారినా కూడా, 150 లోపు స్కోర్ అయితే ఖచ్చితంగా ఛేజ్ చేయవచ్చు. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకుని, ప్రత్యర్థి జట్టును 150 లోపు కట్టడి చెయ్యాలి. ఆ తర్వాత స్కోర్ చూసుకుంటూ ఛేజ్ చేయవచ్చు. ముఖ్యంగా ఇటు జట్లు పవర్ ప్లే ను బాగా ఉపయోగించుకోవాలి. ఓపెనర్లు వికెట్ పడకుండా మొదటి పవర్ ప్లే లో 60 నుండి 70 పరుగులు చేయగలిగితే,  మిగిలిన ఓవర్లలో వీలైనన్ని పరుగులు చేయవచ్చు.

ఈ పిచ్ మీద అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, బౌండరీలు కన్నా స్ట్రైక్ రొటేట్ చేయాలి. అస్సలు డాట్ బాల్స్ కాకుండా చూసుకుంటే మరీ మంచిది. ఇదే సమయంలో చేతిలో వికెట్లు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక జట్టు ఈ పిచ్ పై గెలవడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. మరి ఈ మ్యాచ్ లో ఏమి జరుగుతుందో... ఎవరు చెన్నై తో ఆఖరి సమరానికి వెళ్లేదెవరో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: