క్రికెట్  తాజాగా చోటు దక్కించుకుంది ఎక్కడో తెలుసా ?
 
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉదృతి క్రమంగా తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో  ఆ రాష్ట్రప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించింది.  గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఆటల పోటీలను నిర్వహించ నుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి క్రీడాభిమాని కావడం తో ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) రాష్ట్రం అంతటా క్రీజలు నిర్వహించాలని భావిస్తోంది.  ఇందకోసం ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది . విజయదశమి పండుగతో  రాష్ట్రంలో క్రీడా పోటీలు అరంభించాలని శాప్ తలంచింది.  ప్రతి జిల్లా లోనూ మూడు నుంచి నాలుగు దశల్లో  పోటీలు నిర్వహిస్తారు.  ఫేజ్ -1, ఫేజ్-2 క్రింద ఈ పోటీలుంటాయి.  ఈ మూడు, నాలుగు దశల్లో గెలుపొందిన వారు జిల్లా స్థాయికి చేరుకుంటారు.  ప్రతి జిల్లా నుంచి జట్ల ను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారు.  ఫైనల్ విజేతలకు  సి.ఎం కప్ ను అందజేస్తారు. వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్,  కబడ్డీ, ఖోఖో,  హాకీ, బ్యాడ్నింటన్, అథ్లెటిక్స్ తో పాటు పలు క్రీడాంశాలుంటాయి. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన వేురకు జరుగుతున్న ఈ క్రీడల్లో  గ్రామీణ క్రీడాకారులకు ప్రాధాన్యత ఉంటుందని శాప్ అధికారులు పేర్కోన్నారు. రాష్ట్రం లోని 175 నియోజక వర్గాలు, పదమూడు జిల్లాల క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో పోటీ పడనున్నారు. తమ ప్రతిభను చాటనున్నారు. ఈ పోటీలలో పాల్గోన్న క్రీడాకారులకు భవిష్యత్ లో మంచి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు జాతీయ , అంతర్జాతీయ అంశాలలో ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశాలలో అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రా స్థాయి పోటీలను కేవలం ఒకే ప్రాంతంలో కాకుండా ప్రతి ఏడాది ఒక్కో జిల్లాలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త క్రీడా పాలసీని తీసుకు రానుందని శాప్ ఎం.డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నూతన విధానం ద్వారా క్రీడాకారులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: