ప్రస్తుతం బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  2008లో బిసిసిఐ ఐపీఎల్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు ఈ లీగ్ ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటుందని. నాటి నుంచి నేటి వరకు అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటు దూసుకుపోతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అంతే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్లకు  సత్తా చాటి భారత జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా మారిపోతుంది అని చెప్పాలి.  ఇక అటు బిసిసిఐకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారీగానే ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.



 అంతేకాదండోయ్..  భారత జట్టు మరింత పటిష్టవంతంగా మారే విధంగా టీమిండియాకు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ ని కూడా వెతికి పెడుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇలా ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటి భారత జట్టులో స్థానం సంపాదించుకున్నారు.  ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత జట్టు రోజురోజుకీ పటిష్టంగా మారడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఇక ప్రతి ఏడాది కూడా ప్రేక్షకులందరికీ అంతకుమించిన క్రికెట్ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్.



 అయితే వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ మజా మరింత పెంచేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో కి రెండు కొత్త జట్లని తీసుకురావాలని నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన సమావేశం కూడా జరిగింది.  అయితే ఐపీఎల్ లోకి రాబోయే రెండు కొత్త జట్లకు బిసిసిఐ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిసిసిఐ కొత్త జట్ల కోసం వేలంపాట నిర్వహించాలని నిర్ణయించింది  అయితే వేలం పాటకు ముందే తమకు నచ్చిన కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని జట్లు సమతూకంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది బిసిసీఐ. అయితే ఒక జట్టు ఎంత మంది ఆటగాళ్లను ఇలా ముందుగానే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: