ఇటీవలే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఎంత అద్భుతంగా రాణించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ అన్ని ఫార్మాట్లలో కూడా అదరగొడుతున్నాడు. టీమిండియా విజయాలలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు కేఎల్ రాహుల్.  ఇక ఇటీవల ఐపీఎల్ లో కూడా తన సత్తా చాటాడు. దీంతో కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.  ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ ని ఎలా రాణించ బోతున్నాడు  అన్నదానిపై ప్రస్తుతం ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.



 కేఎల్ రాహుల్ బ్యాటింగ్ టీమిండియా విజయంలో కీలక గా మారబోతుంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఒక నిర్మాణాత్మకమైన  బ్యాటింగ్ తో రాణిస్తే  ఇక అటు జట్టు కెప్టెన్గా కోహ్లీ పై కూడా ఒత్తిడి తగ్గుతుందని ఎంతో మంది చెబుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాడు బ్రెట్లీ ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రస్తుతం భారత బ్యాట్స్మెన్ కె.ఎల్.రాహుల్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇక త్వరలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో కె.ఎల్.రాహుల్ అంటే టీమిండియాకు తిరుగులేదు అంటూ బ్రెట్ లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.



 కె.ఎల్.రాహుల్ రాణిం చడం వల్ల అటు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా ఎంతో ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కె.ఎల్.రాహుల్ కొనసాగుతున్నాడు.  ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రాహుల్ టి20 వరల్డ్ కప్ లో కూడా రాణిస్తాడు. అతడు భారత బ్యాటింగ్ విభాగానికి వెన్నుముక్క. కె.ఎల్.రాహుల్ రాణిస్తే కోహ్లీ పై ఎంత ఒత్తిడి తగ్గుతుంది. కోహ్లీకి ఇదే చివరి టి20 వరల్డ్ కప్ కాబట్టి..  కోహ్లీ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: