భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ..  కేవలం క్రికెట్ కి మాత్రమే ఎక్కువ గుర్తింపు ఉంది అని చెప్పాలి. అటు క్రికెట్ ఆటగాళ్లకు ఉన్నంత క్రేజ్ మిగతా ఆటగాళ్లు ఎక్కడ ఉండదు.  భారత్కు ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించినప్పటికీ మిగతా క్రీడలకు చెందిన ఆటగాళ్లు  మాత్రం ఎక్కడ మీడియాలో కనిపించరు. క్రికెట్ ఆటగాడు ఏదైనా చిన్న రికార్డు కొల్లగొడితే చాలు ఇక  ఎక్కడ చూసినా అతని ఫోటో అతని పేరే దర్శనమిస్తూ వుంటుంది. ఇలా భారత్లో క్రికెట్ అనే మాయలో ఎన్నో క్రీడలకు సంబంధించిన క్రీడాకారుడు కనుమరుగు అయిపోతున్నారు అనే చెప్పాలి. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఎక్కడా తెర మీదికి రావడం లేదు. అలాంటి క్రీడాకారులలో ఒకరు ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి.



 విదేశాలలో ఫుట్బాల్ ఆటకు ఎంతగానో క్రేజ్ ఉంటుంది. ఒక ఫుట్బాల్ ఆటగాడు వరుసగా గోల్ చేస్తూ రికార్డులు సాధించాడు అంటే చాలా సూపర్ స్టార్ గా మారిపోతూ ఉంటాయి. కానీ గత కొంత కాలం నుంచి భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే కాదు ఒక ఆటగాడిగా కూడా తన ప్రతిభతో ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నాడు సునిల్ చెత్రి.  కానీ ఇతని పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుందే తప్ప క్రికెట్ ఆటగాళ్లకు చేసినట్లు ఎక్కువ ప్రచారం చేయరు. ఇకపోతే ఇటీవల భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్  ఒక అరుదైన రికార్డును సాధించాడు.



 ఇప్పటికే అంతర్జాతీయ ఫుట్బాల్ లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సునిల్ చెత్రి. ఇక ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. బుధవారం మాల్దీవుల తో జరిగిన మ్యాచ్ లో గోల్ చేసి అంతర్జాతీయ మ్యాచ్లలో మొత్తంగా 79 గోల్స్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫుట్బాల్ దిగ్గజంగా కొనసాగిన పీలే ఫుట్బాల్లో 78 గోల్స్ చేయగా భారత ఫుట్బాల్ కెప్టెన్ సునిల్  79 గోల్స్ చేసి ఆ దిగ్గజాన్ని అధిగమించాడు. ప్రస్తుతం టాప్ లో క్రిస్టియానో రోనాల్డో 115, ఆలీ 109, ముక్తార్ తహరి 89, మెస్సి 80 గోల్స్ తో టాప్ లో ఉన్నారు. ఇక సునీల్ చెత్రి ఒక్క గోల్ చేసాడు అంటే మెస్సి తో సమానంగా అంతర్జాతీయ ఫుట్బాల్ లో ఎక్కువగా గోల్స్ చేసిన ఆటగాడిగా టాప్ ఫైవ్ లోకి చేరుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: