యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో నేడు ఫైనల్ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటికే ఐపీఎల్లో టైటిళ్లను సాధించాయి. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికి మూడు సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ఎత్తగా... గంభీర్ నాయకత్వంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రెండు సార్లు టైటిల్ అందుకుంది. అలాగే ఈ రెండు జట్లు 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో తలపడితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై చేయి సాధించింది. ఇక ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే వస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించి కష్ట కాలంలో జరిగిన ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను తీసుకెళ్తారు అనేది చూడాలి.

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (wk/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

కోల్ కతా : శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (wk), ఇయన్ మోర్గాన్ (c), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

మరింత సమాచారం తెలుసుకోండి: