ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అనుకున్న విధంగా చెన్నైని కట్టడి చేయలేకపోయింది. అయితే చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ మంచి ఆరంభము ఇచ్చారు. వీరిరువురు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించారు కానీ ఆ తర్వాత గైక్వాడ్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా బ్యాటింగ్ కు వచ్చిన రాబిన్ ఊతప్ప 15 బంతుల్లో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అయితే అప్పటికే క్రీజ్లో కుదురుకున్న డుప్లెసిస్ 86 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. ఇక అతనికి 19 బంతుల్లో 36 పరుగులు చేసి మోయిన్ అలీ సహకరించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేయగలిగింది.

ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన కేకేఆర్ బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్ లో విఫలం అయింది. ఇందులో స్పిన్నర్ సునీల్ నరైన్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా శివమ్ మావి ఆఖరి బంతికి వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలవాలంటే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు చేయాలి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిలో చెన్నై బౌలింగ్ ను ఎదుర్కొని కేకేఆర్ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ అందుకుంటుందా... లేదా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వారిని కట్టడి చేసి నాలుగోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలుస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: