భారత్ వేదికగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021వ సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిన్న ముగిసింది. అయితే సీజన్ ముగియడంతో ఈ ఏడాది ఐపీఎల్లో అన్ని రకాల అవార్డులను ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ యువ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ నిలిచాడు. అలాగే ఈ ఏడాది ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్.రాహుల్ ఉన్నాడు. రాహుల్ మొత్తం 13 మ్యాచ్ లలో 30 సిక్సులు బాదాడు. అలాగే ఐపీఎల్ 2021 లో గేమ్ చేంజ్ అర్ ఆఫ్ ది సీజన్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ఉన్నాడు.

ఇక ఈ ఐపీఎల్ 2021 లో సూపర్ స్ట్రైకర్స్ ఆఫ్ ది సీజన్ స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్మైర్ 168 స్ట్రైక్ రేట్ తో నిలిచాడు. అలాగే క్యాచ్ ఆఫ్ ది సీజన్ గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు రవి బిష్ణోయ్ ఉన్నాడు. అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్లో బిష్ణోయ్ సునీల్ నరైన్ క్యాచ్ ను డీప్ మిడ్ వికెట్ లో అద్భుతంగా అందుకున్నాడు. ఇంకా ఈ ఏడాది ఫైర్ ప్లే అవార్డును రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్స్ ఆఫ్ ది సీజన్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్  గైక్వాడ్ ఉన్నాడు. మరియు ఈ ఏడాది అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడు కూడా గైక్వాడ్. 16 మ్యాచుల్లో 64 ఫోర్లు బాదేశాడు ఈ చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్. అలాగే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడు కూడా ఇతడే. ఈ ఐపీఎల్ లో మొత్తం 87 బౌండరీలు బాదేశాడు రుతురాజ్ గైక్వాడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: