భారత క్రికెట్ అభిమానులకు ఈరోజు గుడ్ న్యూస్ తెలిసింది. ఈ నెలలో జరగనున్న టి20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు ప్రస్తుత నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉండడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిన్న ఈ విషయంపై రాహుల్ ద్రావిడ్ ను కలిసి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. సెక్రెటరీ జేషా ప్రత్యక్షంగా మాట్లాడారని సమాచారం. ఇందులో వీరిరువురు కలిసి ది వాల్ ను భారత హెడ్ కోచ్ గా ఉండేందుకు ఒప్పించారని ఓ బీసీసీఐ అధికారి తాజాగా ప్రకటించారు. కానీ 2023 లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ వరకే హెడ్ కోచ్ గా ఉండటానికి ద్రావిడ ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఎంసీఏ హెడ్ గా ఉన్న ద్రావిడ్ ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత భారత జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు అని సమాచారం.

అలాగే భారత బౌలింగ్ కోచ్ గా పరాస్ మామ్ బ్రేను తీసుకున్నట్లు తెలుస్తుంది మరియు బ్యాటింగ్ కోచ్ గా ఇప్పుడు ఉన్న విక్రమ్ రారోడ్ కొనసాగుతున్నారని.. .ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ విషయంలో ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే భారత యువ ఆటగాళ్లకు అండర్-19 స్థాయిలో శిక్షణ ఇచ్చి నేడు భారత జట్టులోని మేటి ఆటగాళ్లు గా ద్రావిడ్ తయారు చేసిన విషయం తెలిసిందే. వారంతా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే రాహుల్ ద్రావిడ్ ను భారత కోచ్గా నియమించాలని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈమధ్య శ్రీలంకకు వెళ్లిన భారత రెండో జట్టుకు కోచ్ గా ఉన్న ద్రావిడ్ ఇప్పుడు పూర్తి భారత జట్టుకు కోచ్ గా ఉంటాడు అని తెలియడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: