భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ నిన్న విజయవంతంగా ముగిసింది అయితే ఈ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ నాయకత్వంలో నాల్గవ సారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇచ్చే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లకు కూడా చాలా విశిష్టత ఉంటుంది, అయితే ఆరెంజ్ క్యాప్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇస్తారు, అలాగే పర్పుల్ క్యాప్ అద్భుతంగా బౌలింగ్ చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కి ఇస్తారు.

ఇక ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున 16 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 635 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ ఉండగా.. నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు గైక్వాడ్. ఇక ఈ ఏడాది పర్పుల్ క్యాప్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ పేసర్ హర్షల్ పటేల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మొత్తం 15 మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు సాధించాడు.. ఇందులో ఒక ఫైవ్ వికెట్ హాల్... ఒక ఫోర్ వికెట్ హాల్ ఉంది. అయితే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి రికార్డుకి ఇది సరి సమానం. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బ్రావో కూడా అత్యధికంగా ఒక్కే సీజన్ లో 32 వికెట్లు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: