ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2021 ఫైన‌ల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై విజ‌యం సాధించి రికార్డు న‌మోదు చేసిన విష‌యం విధిత‌మే. ధోనీ కెప్టెన్సీలో ఆ జ‌ట్టు నాల‌గ‌వ సారి టైటిల్ ను కైవ‌సం చేసుకున్న‌ది. ధోనీకి ఎవ‌రూ సాటీ లేర‌ని.. అత‌ని అభిమానుల‌కు చెన్నైసూప‌ర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్‌రైనా స‌తీమ‌ణి ప్రియాక మ‌రొక శుభ‌వార్త చెప్పింది. ధోనీ మ‌ర‌ల తండ్రి కాబోతున్నాడ‌ని ఆమె వెల్ల‌డించిన‌ట్టు ప‌లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీ భార్య సాక్షి ప్ర‌స్త‌తం నాలుగు నెల‌ల గ‌ర్భావ‌తి అని ఆమె వెల్ల‌డించిన‌ట్టు పేర్కొంటున్నారు.

ధోనీ భార్య సాక్షి గ‌ర్భంతో ఉన్న‌ద‌ని ప‌లు సామాజిక మాధ్య‌మాల వేదిక ద్వారా ధోనీకీ కంగ్రాట్స్ సైతం చెప్పుతున్నారు. ధోనీ, సాక్షిలు 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు 2015లో జీవాసింగ్ పుట్టింది. జీవా అంటే ధోనీకి ఎంతో ఇష్టం అంట‌. ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా జీవాతో ఆయ‌న స‌ర‌దాగా గ‌డుపుతార‌ట‌. జీవాతో ఉన్న ఫోటోలు, వీడియోలు, సాక్షి సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ధోనీ మ‌ళ్లీ తండ్రి కాబోతున్నారు అని అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్వ‌ర‌లోనే అత‌ను ప్రక‌ట‌న చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ పైన‌ల్‌లో  ధోనీ టీమ్ విజ‌యం సాధించిన  త‌రువాత సాక్షి, జీవా వ‌ద్ద‌కు ధోనీ వ‌చ్చారు. వారిని కౌగిలించుకుని సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది.


ధోనీ టీ 20 ప్రపంచ కప్‎లో భారత జట్టకు మెంటర్‎గా పని చేయనున్నారు. అతను ఈ సేవలకు ఎలాంటి డబ్బు తీసుకోవడంలేదని బీసీసీఐ గతంలోనే తెలిపింది. టీ20 ప్రపంచ కప్ రేపటి నుంచి యూఏఈ, ఒమన్‎లో ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్ 24న భారత్ పాక్‎తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   ఇప్ప‌టికే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకులా అమ్మ‌డుపోయాయి. ప్రేక్ష‌కులకు అనుమ‌తి ఉండ‌డంతో మ్యాచ్ చూడ‌డానికి ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌పంచంలో ఏ మ్యాచ్‌ను కూడ ఇంత ఆస‌క్తిగా ఎవ‌రు చూడ‌రు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్ర‌పంచం మొత్తం టీవీల‌కు అతుక్కుని మ‌రి మ్యాచ్ చూస్తుంటారు. అదేవిధంగా ధోనీ త‌న భార్య గ‌ర్భ‌వ‌తి అని అధికారికంగా ఎప్పుడు ప్ర‌క‌టిస్తార‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచ‌రూస్తున్నారు. మ‌రి ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: