క్రికెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. టీవీలో ఏ మ్యాచ్ వచ్చినా అలాగే చూస్తూ ఉండిపోతారు. అలాంటిది టీ20 లీగ్స్ వచ్చాయంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వాటిలో ప్రముఖంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మామూలు క్రేజ్ లేదు. ఐపిఎల్ సీజన్ 14 లో బాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 4 వ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను సాధించింది. దానితో ఐపిఎల్ 14 సీజన్ ముగిసింది. ఇప్పుడు మరో సమరానికి తెరలేవనుంది. ఈ రోజు నుండి టీ20 వరల్డ్ కప్ యూఏఈ మరియు ఒమన్ వేదికగా మొదలు కానుంది. వాస్తవంగా అయితే ఈ టీ20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా బీభత్సం కారణంగా ఒక్కసారిగా అసలు వరల్డ్ కప్ జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తాయి.

అయితే పలు చర్చల అనంతరం ఐసీసీ ఈ వరల్డ్ కప్ ను యూఏఈ మరియు ఒమన్ దేశాల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు మొదటి మ్యాచ్ లో ఒమన్ మరియు పిఎన్జి లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్న 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు చాలా ముఖ్యం అని చెప్పాలి. ఇద్దరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాలని ఎంతో ఆరాటపడుతున్నారు. ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఒమన్ లో జరగనుంది. ఇది క్వాలిఫైయింగ్ స్టేజ్ మాత్రమే. అయితే ఇరు జట్ల గెలుపు అవకాశాలు చూస్తే ఎక్కువగా ఒమన్ గెలిచే అవకాశం ఉంది.

అయితే పి ఎన్ జి ని సైతం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఈ జట్టులోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇది టీ ట్వంటీ కాబట్టి ఒక్క ప్లేయర్ సరిగా ఆడితే చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు. కాగా ఈ రోజు మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ.   మరి ఈ రెండు జట్లు సూపర్ 12 కు అర్హత సాధిస్తాయా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: