టీ 20 ప్రపంచ కప్ లో బాగంగా ఒక వైపు క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మరో వైపు వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. నిన్న జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఒకటి ఇండియా మరియు ఇంగ్లాండ్ ల మధ్య జరిగింది. ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి.  దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇండియా సారథి కోహ్లీ ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్లుగా బరిలోకి బట్లర్ మరియు జాసన్ రాయ్ లు ఇద్దరూ అటాకింగ్ మోడ్ లో తమ బ్యాటింగ్ ను కొనసాగించారు. మొత్తానికి ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో  188 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ కున్న బౌలింగ్ వనరులు చూసుకుంటే డిపెండ్ చేసుకోవడానికి ఇది మంచి స్కోర్.  అందుకే ఇంగ్లాండ్ టీమ్ గెలుపుపై ధీమాగానే ఉన్నట్లు కనిపించింది. అయితే ఆఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు ఇండియా తరపున ఓపెనర్లుగా వచ్చిన కె ఎల్ రాహుల్ మరియు ఇషాన్ కిషన్ లు ఇంగ్లాండ్ బౌలర్లలో మొదటి నుండి విరుచుకు పడ్డారు. రాహుల్ అయితే ఆకాశమే  హద్దుగా చెలరేగిపోయాడు. ఇషాన్ కిషన్ 70 పరుగులతో రాణించగా, రాహుల్ 51 పరుగులు చేశాడు. ఇక రిషభ్ పంత్ ఎప్పటి లాగే ధనా దన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఓవర్ మిగిలి వుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది.

ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న ప్రత్యర్థులు అందరికీ సవాల్ విసిరింది టీమ్ ఇండియా. ప్రస్తుతం టీమిండియా కు ఉన్న బ్యాటింగ్ లైన్ అప్ దుర్భేధ్యంగా ఉంది. ఈ ఆదివారం పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ తో ఇండియా తన జర్నీని స్టార్ట్ చేయనుంది. దీనితో ఇండియా తో పోయే పడబోయే జట్లకు ఒక డేంజర్ బెల్ అని చెప్పవచ్చు. మరి ఇదే దూకుడు ముందు జరగనున్న మ్యాచ్ లలోనూ కొనసాగిస్తుందా అన్నది తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: