క్రికెట్ అభిమానులు ఒక‌ప్పుడు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఒక‌రు. ఆయ‌న స్థానం ఎప్పుడు ప‌దిలంగానే ఉంటుంది. అత‌ను మైదానంలో ఉంటే ప‌రుగులు వ‌ర‌ద‌లా పారుతుంటాయి. 1999లో క్రికెట్‌లోకి ఆరంగేటం చేశారు. కొత్త‌లో కాస్త త‌డ‌బ‌డ్డాడు. ఆత‌రువాత 2001 లో తాను ఏమిటో నిరూపించుకున్నాడు. 2001 వ‌ర‌కు త‌న‌ను ఎంతో మంది విమ‌ర్శ‌లు చేశారు. అవేమి ప‌ట్టించుకోకుండా 2001లో ఆస్ట్రేలియాతో భార‌త్ త‌ల‌ప‌డింది. అప్పుడు జ‌ట్టులో సెహ్వాగ్ చేసిన అర్థ‌సెంచ‌రీ జ‌ట్టుకు కీల‌క భాగ‌స్వామ్యం అయింది. అత‌నిలో ఉన్న క‌సి, కృషి బ‌య‌ట ప‌డింది. ఇక అప్ప‌టి నుంచి సెహ్వాగ్ పేరు మారుమోగింది. భార‌త జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా మారిపోయాడు.
 
ఆ త‌రువాత స‌చిన్ టెండుల్క‌ర్ స్థానంలో ఓపెన‌ర్‌గా వ‌చ్చి గ్రౌండ్‌లో ప‌రుగుల‌ను వ‌ర‌ద‌లా పారించేవాడు. జ‌ట్టులో ఎవ‌రు అవుటైనా ప్ర‌త్య‌ర్థి అంత‌గా స్పందిచ‌రు. కానీ వీరేంద్ర‌సెహ్వాగ్ ఔట్ అయితే ప్ర‌త్య‌ర్థుల సంతోషానికి అవ‌ధులుండ‌వు. టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ పై త్రిబుల్ సెంచ‌రీ చేసి ఘ‌న‌త సాధించాడు. త్రిబుల్ సెంచ‌రీ చేసిన మూడ‌వ ఆట‌గాడిగా.. వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా రికార్డు న‌మోదు చేసుకున్నాడు.

 
మొత్తం 251 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో సెహ్వాగ్ 8273 ప‌రుగులు చేశాడు. ఇక టెస్ట్‌ల్లో 103 మ్యాచ్‌ల‌లో 8586 ప‌రుగులు చేసి  49.34  స‌గ‌టున నిలిచాడు. సెహ్వాగ్ బ్యాట్‌తోనే కాదు బాల్‌తో కూడ మెరుపులు మెరిపించేవాడు. వ‌న్డేల్లో త‌న స్పిన్ బౌలింగ్‌తో 96 వికెట్లు తీశాడు. టెస్ట్ ల్లో 40 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2011 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన భార‌త‌జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా ఒక‌డు.  2003 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు అంతా ఒక్క‌సారిగా కుప్ప కూలిపోతున్న త‌రుణంలో సెహ్వాగ్ ఇన్నింగ్ అద‌ర‌గొట్టాడు. సెహ్వాగ్‌కు తోడుగా ఎవ‌రైనా ఉంటే క‌చ్చితంగా క‌ప్ గెలిచేద‌ని వాద‌నలు అప్ప‌ట్లో వినిపించాయి. సెహ్వాగ్ కండ్లు చెదిరే షాట్‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటాడు. అత‌ను కొట్టే సిక్స్‌.. ఫోర్ షాట్‌లు ఎంతో స్టైలిష్‌గా ఉంటాయి. నేడు వీరేంద్ర‌సెహ్వాగ్ పుట్టిన రోజు. ఇండియాహెరాల్డ్ త‌రుపున వీరూకు జన్మ‌దిన‌శుభాకాంక్ష‌లు. ఇలాంటి జ‌న్మ‌దిన వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని.. ఇండియా హెరాల్డ్ ఆకాంక్ష‌.



 

మరింత సమాచారం తెలుసుకోండి: