ఇటీవలి కాలంలో క్రికెట్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది.  క్రికెట్ లో  టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్ అంటూ మూడు ఫార్మాట్లు  ఉన్నాయి. అయితే మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను కొనసాగించకుండా ముగ్గురిని కెప్టెన్ లుగా కొనసాగిస్తున్నాయి వివిధ దేశాల క్రికెట్ బోర్డులు. భారత్లో మాత్రం మూడు ఫార్మాట్ల కి ఒక్కడే కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే మూడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా ఉన్న కోహ్లీ సక్సెస్ కాలేకపోతుండటంతో గత కొన్ని రోజుల నుంచి కెప్టెన్సీ మార్పు పై తీవ్రస్థాయిలో డిమాండ్లు వస్తున్నాయి. బి సిసీఐ మాత్రం కెప్టెన్సీ మార్పు ఉండదు అంటూ స్పష్టం చేసింది. కానీ ఇటీవల  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్కప్ తర్వాత తాను టి20 ఫార్మాట్కు కెప్టెన్గా తప్పుకో పోతున్నాను అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు.



 కేవలం భారత జట్టుకు మాత్రమే కాదు అటు బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా తప్పకోపోతున్నాను అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ.  ఇక ఎవరూ ఊహించని విధంగా సడన్గా కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కోహ్లీ కేవలం టి20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుండి మాత్రమే వండే  ఫార్మాట్ కెప్టెన్సీ   బాధ్యతలు కూడా వదులుకో పోతున్నాడు అన్నది తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ జట్టు టి-20 ఫార్మెట్ తో పాటు వన్డే ఫార్మాట్ కి కూడా టీమిండియా కొత్త కెప్టెన్ గా అవతరించి పోతున్నాడట.



 అయితే ఇలా రోహిత్ శర్మ టీ-20 ఫార్మెట్ తో పాటు వన్డే ఫార్మాట్ కి కూడా కెప్టెన్గా కావడం దాదాపు ఖరారైపోయింది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే అటు టి20లో ఇప్పటికే తాను ఒక సక్సెస్ఫుల్ అన్న కెప్టెన్ అన్న విషయాన్ని రోహిత్ శర్మ ఐపీఎల్ లో నిరూపించుకున్నాడు.  కాగా త్వరలో ఇక రోహిత్ శర్మ వన్డే టి20 ఫార్మట్ లకి కెప్టెన్ గా మారబోతుండగా.. కోహ్లీ కేవలం టెస్ట్ ఫార్మాట్ కి మాత్రమే పరిమితం కాబోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: