పొట్టి ప్రపంచ కప్ కు సంబంధించిన క్వాలిఫైయర్ మ్యాచ్ లు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండు గ్రూప్ లుగా జరుగుతున్న ఈ మ్యాచ్ లలో గ్రూప్ ఏ నుండి దాదాపుగా ఐర్లాండ్ మరియు శ్రీలంకలు సూపర్ 12 కు అర్హత సాధించినట్లే. ఇక అసలు కథంతా గ్రూప్ బి లోనే ఉంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ న్యూ గినియాను చిత్తుగా ఓడించి సూపర్ 12 లోకి అడుగు పెట్టింది. మొదటి మ్యాచ్ లో తడబడ్డ బంగ్లాదేశ్ తర్వాత పుంజుకుని కీలకమైన రెండు మ్యాచ్ లలో గెలిచి మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాధించింది. ఇక గ్రూప్ బి నుండి మిగిలిన ఒక్క స్థానం కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి. కాసేపటి క్రితమే స్టార్ట్ అయిన మ్యాచ్ లో ఆతిధ్య ఒమన్ తో స్కాట్లాండ్ జట్టు తలబడుతోంది.

టాస్ గెలిచి ఒమన్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇన్ ఫామ్ బ్యాట్స్మన్ జతిందర్ సింగ్ లేని పరుగుకు ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మరో వికెట్ కోల్పోవడంతో ఒమన్ ఆత్మరక్షణలో పడిపోయింది.  ఆరంభంలోనే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఓపెనర్ అకిబ్ ఇలియాస్ మరియు నదీమ్ లు ఆదుకున్నారు. ప్రస్తుతానికి ఆచితూచి ఆడుతున్నారు. కానీ మంచి ఊపుమీదున్న స్కాట్లాండ్ ను ఓడించాలంటే కనీసం 170 పరుగులు చేయాల్సి ఉంది. ఈ ట్రాక్ లపై చేజింగ్ కొంచెం కష్టంగానే ఉంది.

కాబట్టి మంచి స్కోర్ ను చేయగలిగితే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. ఈ మ్యాచ్ ఇద్దరికీ చాలా ముఖ్యం. ఒమన్ మంచి స్కోర్ టార్గెట్ గా ఇచ్చి, తక్కువ స్కోర్ కి స్కాట్లాండ్ ను కట్టడి చేయాల్సి ఉంటుంది. మరి సమీకరణాలు ఎలా ఉన్నా ముందు మ్యాచ్ గెలవడం ముఖ్యం. మరి కీలకమైన ఈ మ్యాచ్ లో గెలుపెవరిదో తెలియాలంటే ఇంకాస్తసేపు ఆగాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: